Pawan Kalyan: 2019 నుండి 2024 వరకు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పై గత వైసీపీ ప్రభుత్వం చేసిన చర్యలు మనమంతా చూశాము. ఆయన సినిమా విడుదలయ్యే సమయం లోనే అర్థ రాత్రి జీవోలు జారీ చేసి,అతి తక్కువ రేట్స్ కి టికెట్స్ ని విక్రయించేలా ఆర్డర్లు జారీ చేయడం. అదే విధంగా ఆయన పై మూవీ ఆర్టిస్టులను ఉపయోగించి పరుష పదజాలంతో ఇంట్లో ఆడవాళ్ళని కూడా వదలకుండా ఇష్టమొచ్చినట్టు తిట్టించడం, పర్యటనలకు వెళ్తే అడ్డుకోవడం, ఇలాంటివి ఎన్నో మనం కళ్లారా చూశాము. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేని వాళ్లకు కూడా ఎందుకు ఇంత టార్గెట్ చేస్తున్నారు అని అనిపించేలా చేశారు. నెల్లూరు నుండి రాయలసీమ వరకు ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అత్యధిక శాతం వైసీపీ పార్టీ తోనే ఉండేవారు గతంలో.
Also Read: ‘కిష్కిందపురి’ మూవీ టాక్ వచ్చేసింది… ఏంటి భయ్యా మరీ ఇలా ఉంది…
కానీ ఇలా రిపీట్ గా టార్గెట్ చేసి ఆయన్ని తొక్కే ప్రయత్నం చేయడం తో పవన్ అభిమానులు వైసీపీ కి దూరం అయ్యారు. ఫలితంగానే 2024 ఎన్నికలలో వైసీపీ కి కంచుకోటగా పిలవబడే నెల్లూరు జిల్లాలో ఒక్కటంటే ఒక్క సీట్ కూడా రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారం లోకి వచ్చాడు. అయినప్పటికీ కూడా ఆయన్ని తొక్కేందుకు హై కోర్టు న్యాయస్థానం ని ఇష్టమొచ్చినట్టు వాడేస్తున్నారు ఈమధ్య కాలంలో ప్రతిపక్ష పార్టీ కి చెందిన వాళ్ళు. ‘హరి హర వీరమల్లు’ మూవీ విడుదల సమయం లో టికెట్ రేట్స్ భారీగా పెంచారని, తక్షణమే తగ్గించాలంటూ ఒక చోట కేసు ఫైల్ చేసారు ఒకరు. ఆ తర్వాత నెల రోజుల క్రితం ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రొమోషన్స్ కోసం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని, అసలు ఉప ముఖ్యమంత్రి స్థానం లో కూర్చున్న వ్యక్తి సినిమాలు చేయకూడదని మరొకరు కేసు వేశారు.
హై కోర్టు దీనిని తిప్పి కొట్టింది. ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ముఖ్యమంత్రి కూడా సినిమా చేసుకోవచ్చు అంటూ తీర్పుని ఇచ్చింది, అంతే కాకుండా ప్రభుత్వ ధనాన్ని సినిమా ప్రొమోషన్స్ కోసం ఉపయోగించారు అంటూ చేసిన ఆరోపణల్లో ఎలాంటి ఆధారం లేదని ఆ కేసు ని కొట్టిపారేసింది. ఇక రీసెంట్ ఇంకొకరు పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రభుత్వ ఆఫీస్ లలో ఉండకూడదు అంటూ ఒకరు పిటీషన్ వేశారు. కోర్టు దీనిని కూడా కొట్టిపారేసింది. ఇలా వరుసగా ఆయన పై నాన్ స్టాప్ గా టార్గెట్టింగ్ జరుగుతూనే ఉంది. మరో రెండు వారాల్లో ఓజీ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమాకు ఇంకెన్ని చేస్తారో అని అభిమానులు ఇప్పటి నుండే భయపడుతున్నారు. ఇదంతా ప్రతిపక్ష పార్టీ కి చెందిన ఒక ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఎదో ఒక కేసు ని వేయించే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఇంత ద్వేషం?, ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న ఆయన గట్టిగా టార్గెట్ చేస్తే ప్రతిపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రుల అక్రమ ఆస్తులను నిమిషాల వ్యవధిలోనే ప్రభుత్వ పరం చేసుకోగలడు. ఆ అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయన టార్గెట్ చేయడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ ని మాత్రం వీళ్ళు ఎందుకని ఇంత టార్గెట్ చేస్తున్నారు?, చంద్రబాబు నాయుడు, లోకేష్ వంటి వారిపై కూడా వీళ్లకు ఇంత పగ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ నే టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక బలమైన సామజిక వర్గం అతనితో ఉండడం, అతను కూటమిలో ఉన్నంత కాలం మనం అధికారం లోకి రాలేము అనే ఆలోచనతో, ఆయన ఎలాగో ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం లేకపోవడం తో , ఏమి చెయ్యలేక ఎలా అయినా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం తో ఇదంతా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.