OTT Releases of the Week: ఈ కరోనా క్లిష్ట సమయంలో ప్రేక్షకులను అలరించింది, నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టింది ఓటీటీ (OTT) సంస్థలే. కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ఓటీటీలకే దక్కుతుంది. పైగా ఓటీటీ సంస్థలు మాత్రమే నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో వస్తూ ఉన్నాయి. ట్రెండింగ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరిసుస్తూ ఉన్నాయి.
అయితే, ఈ కరోనా సెకెండ్ వేవ్ తగ్గిన కారణంగా థియేటర్ల దగ్గర సందడి చేయడానికి కొన్ని సినిమాలు ముస్తాబు అవుతున్నా, ‘అఖండ’ లాంటి సినిమాలు గొప్ప విజయాలు సాధిస్తున్నా.. ఇంకా ఓటీటీలోనే రిలీజ్ కావడానికి మరి కొన్ని సినిమాలు సిరీస్ లు రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ ప్రతి వారం కొత్త కంటెంట్ వస్తోంది.
మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు
అమెజాన్ ప్రైమ్ :
ద ఎక్స్‌పాన్స్ (వెబ్ సిరీస్ సీజన్-6) డిసెంబరు10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ఎన్‌కౌంటర్ (హాలీవుడ్ మూవీ) డిసెంబరు10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
నెట్ ఫ్లిక్స్ :
టైటాన్స్ (వెబ్‌సిరీస్ సీజన్-3) డిసెంబరు 8 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
అరణ్యక్ (హిందీ సిరీస్) డిసెంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ద అన్ ఫర్‌గివబుల్ (హాలీవుడ్) డిసెంబరు 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
ద లైట్ హౌజ్ (హాలీవుడ్) డిసెంబరు 1 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
వాయిర్ డిసెంబరు 6 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
Also Read: Mahesh Babu and NTR’s EMK: మహేష్ అభిమానుల అభిమానాన్ని గెలుచుకున్న ఎన్టీఆర్
జీ5 :
కాతిల్ హసీనోంకే నామ్ (హిందీ సిరీస్) డిసెంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :
ఆర్య (హిందీ వెబ్ సిరీస్ సీజన్-2) డిసెంబరు 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.
‘ఆహా’ :
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘పుష్పకవిమానం’ సెంబర్ 10వ తేదీ నుంచి ఆహా వేదికగా ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.
Also Read: NTR: ఎన్టీఆర్ తో పోటీపడి ఆస్తులను పోగొట్టుకున్న స్టార్ !