https://oktelugu.com/

NTR: ఎన్టీఆర్ తో పోటీపడి ఆస్తులను పోగొట్టుకున్న స్టార్ !

NTR: తెలుగు చిత్రసీమ స్వర్ణయుగంలో కళకళలాడుతున్న రోజుల్లో మాస్ హీరోలుగా చలామణి అయింది ఇద్దరే ఇద్దరు. ఎన్టీఆర్, కృష్ణ. నిజానికి ఎన్టీఆర్ కి కృష్ణ అభిమాని. కేవలం ఎన్టీఆర్ సినిమాలు చూసి, నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. పైగా సినిమాల్లో కృష్ణ అవకాశాలు కోసం తిరుగుతున్న రోజుల్లో ఎన్టీఆర్ కృష్ణకి తన ప్రోత్సాహాన్ని అందించారు. అయితే, ఆ తర్వాత కాలంలో వీరిద్దరి మధ్యే గట్టి పోటీ ఏర్పడింది. ఆ పోటీలో కృష్ణ పట్టుదలకు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. […]

Written By:
  • Shiva
  • , Updated On : December 6, 2021 / 05:48 PM IST
    Follow us on

    NTR: తెలుగు చిత్రసీమ స్వర్ణయుగంలో కళకళలాడుతున్న రోజుల్లో మాస్ హీరోలుగా చలామణి అయింది ఇద్దరే ఇద్దరు. ఎన్టీఆర్, కృష్ణ. నిజానికి ఎన్టీఆర్ కి కృష్ణ అభిమాని. కేవలం ఎన్టీఆర్ సినిమాలు చూసి, నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. పైగా సినిమాల్లో కృష్ణ అవకాశాలు కోసం తిరుగుతున్న రోజుల్లో ఎన్టీఆర్ కృష్ణకి తన ప్రోత్సాహాన్ని అందించారు. అయితే, ఆ తర్వాత కాలంలో వీరిద్దరి మధ్యే గట్టి పోటీ ఏర్పడింది. ఆ పోటీలో కృష్ణ పట్టుదలకు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

    NTR

    ఎన్టీఆర్ తో పోటీ ఎందుకు ? అని ఎంతమంది చెప్పినా కృష్ణ వినేవారు కాదు. ఆ తర్వాత రాజకీయాల్లోనూ కృష్ణ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా పని చేసిన రోజులు, సంఘటనలు ఉన్నాయి. కానీ విచిత్రంగా కృష్ణ ఎన్నడూ ఎన్టీఆర్ పై విజయం సాధించలేదు. అయితే, ఎన్టీఆర్ మాత్రం ఎన్నడూ కృష్ణ తనకు పోటీ అని భావించలేదు. అసలు వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి ముఖ్య కారణం ఓ సినిమా.

    అది, ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’ సినిమా తీస్తున్న రోజులు. ఇండస్ట్రీ మొత్తం ఆ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. అప్పుడే కృష్ణకు ఒక ఆలోచన వచ్చింది. ఆ సినిమాకి పోటీగా తాను కురుక్షేత్రం అనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. పైగా ఎన్టీఆర్ సినిమాకి పోటీగా విడుదల చేయాలనుకున్నాడు. అంతేకాకుండా ఎన్టీఆర్ సినిమాకు ఏ పెద్ద ఆర్టిస్ట్ అందుబాటులో లేకుండా.. అందర్నీ ముందుగానే బుక్ చేసుకుని అవుట్ డోర్ తీసుకువెళ్లిపోయాడు.

    Krishna

    ఈ విషయం ఎన్టీఆర్ చేరింది. సహజంగా ఎన్టీఆర్ ఏ విషయంలోనూ మరొకరితో పోటీ పడరు. మాకు మేమే పోటీ అని భావించే ఎన్టీఆర్ కూడా.. ఆ సమయంలో కృష్ణ ‘కురుక్షేత్రం’ సినిమాను పోటీగా భావించారు. పెద్ద ఆర్టిస్ట్ లు లేకపోయినా, తానే నాలుగు క్యారెక్టర్స్ లో నటించి, దొరికిన చిన్నాచితకా ఆర్టిస్ట్ లనే ముఖ్య పాత్రల్లో నటింప జేసి మొత్తానికి ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాను నలభై రోజుల్లో పూర్తి చేశాడు.

    Also Read: Telugu Cinema: తెలుగు సినిమా రంగాన్ని మార్చేసిన చిత్రాలు ఇవే !

    అప్పట్లో దానవీరశూరకర్ణ – కురుక్షేత్రం సినిమాల మధ్య ఘోరమైన పోటీ నడిచింది. పైగా కురుక్షేత్రం సినిమాలో అప్పటికీ ఫుల్ ఫామ్ లో ఉన్న కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రమోహన్, మోహన్ బాబు ఇలా ఒకరేమిటి ? గుమ్మడి, సత్యనారాయణ లాంటి మేటి నటులందరూ కురుక్షేత్రం సినిమాలో ఉన్నారు. కానీ దానవీరశూరకర్ణ సినిమాలో ఒక్క ఎన్టీఆర్ తప్ప మరొకరు కనబడటం లేదు.

    సినిమాలు రిలీజ్ అయ్యాయి. దానవీరశూరకర్ణ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. కురుక్షేత్రం సినిమా అతి పెద్ద డిజాస్టర్ అయింది. ఎన్టీఆర్ ప్రవాహంలో కృష్ణ కొట్టుకుపోయాడు అనే వార్తలు అప్పట్లో బాగా ప్రచారం పొందాయి. దానికి కారణం… కురుక్షేత్రం సినిమాతో కృష్ణ తన ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నారు. పద్మాలయ స్టూడియో కూడా ఆ చిత్రం నుంచే అప్పులపాలు అయింది.

    Also Read: నటనలోనే కాదు, దానాల్లోనూ ‘మహానటి’నే ఆమె !

    Tags