True Up Charges: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా పడితే అలా ప్రజల నుంచి డబ్బులు రాబట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్ చార్జీల పెంపుకు తెర తీసి అభాసు పాలైంది. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో మళ్లీ వెనక్కి తీసుకుంది. దీంతో మధ్య తరగతి ప్రజలపై పెనుభారం పడుతుందని గ్రహించి వాయిదా వేసుకుంది. ఈ నేపథ్యంలో అందినంత దండుకునేందుకే ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. దీనికి గాను కరెంటు బిల్లులు పెంచి నెలకు సుమారు రూ. వెయ్యి రావడంతో ప్రజలు ఖంగుతిన్నారు. బిల్లులు ఎలా కట్టేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై టీడీపీ గోల చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ట్రూ ఆప్ చార్జీల పేరుతో సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు వడ్డించింది. దీంతో బిల్లులు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇంత భారీ బిల్లులు ఎలా చెల్లించేదని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. బిల్లుల మోత తగ్గించేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగానే నవంబర్ నెలలో వచ్చిన బిల్లులో ఆ పెంచిన బిల్లును తగ్గించారు. దీంతో ప్రజలకు కాస్త ఉపశమనం దొరికినట్లయింది.
కరెంటు బిల్లుల పెంపుపై ఏపీఈపీడీసీఎల్ అనుమతి ఇవ్వడంతో బిల్లుల పెంపుపై ప్రభుత్వం ముందడుగు వేసింది. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో తక్షణమే వెనక్కి తగ్గింది. ట్రూ ఆప్ చార్జీలు వడ్డించబోమని తేల్చింది. దీంతో వినియోగదారులు శాంతించారు. లేకపోతే ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు నిర్ణయించుకున్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఇబ్బందిగా మారిన క్రమంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పెంచిన బిల్లులను నవంబర్, డిసెంబర్ నె లల్లో తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ప్రజలు ఉపశమనం పొందారు. దీంతో ప్రభుత్వం ముందుచూపు లేకపోవడంతోనే ఇలా వ్యవహరిస్తుందనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.