Homeఎంటర్టైన్మెంట్ఈసారి హిట్ గ్యారంటీ: సందీప్ కిషెన్

ఈసారి హిట్ గ్యారంటీ: సందీప్ కిషెన్

రొటీన్ లవ్ స్టోరీ చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకొన్న సందీప్ కిషన్ ఆ తరవాత చేసిన చిత్రాల్లో వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ , బీరువా , నిను వీడని నీడను నేనే వంటి చిత్రాలతో విజయాలు దక్కించు కొన్నప్పటికీ అనుకొన్న గమ్యం మాత్రం ఇంకా చేరలేదు. అందుకనే ఒక వైపున హీరోగా యువ కథానాయకులతో పోటీ పడుతూనే, మరో వైపున నిర్మాతగాను సక్సెస్ కావడానికి సందీప్ కిషన్ ప్రయత్నిస్తున్నాడు. సందీప్ కిషన్ ఈ మధ్య నటించిన ‘తెనాలి […]


రొటీన్ లవ్ స్టోరీ చిత్రంతో తెలుగులో గుర్తింపు తెచ్చుకొన్న సందీప్ కిషన్ ఆ తరవాత చేసిన చిత్రాల్లో వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ , బీరువా , నిను వీడని నీడను నేనే వంటి చిత్రాలతో విజయాలు దక్కించు కొన్నప్పటికీ అనుకొన్న గమ్యం మాత్రం ఇంకా చేరలేదు. అందుకనే ఒక వైపున హీరోగా యువ కథానాయకులతో పోటీ పడుతూనే, మరో వైపున నిర్మాతగాను సక్సెస్ కావడానికి సందీప్ కిషన్ ప్రయత్నిస్తున్నాడు. సందీప్ కిషన్ ఈ మధ్య నటించిన ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ ఒక మోస్తరు ఆదరణతో ఫరవాలేదనిపించుకుంది. ఇక తాజా గా ‘A 1 ఎక్స్ ప్రెస్’ చిత్రంలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించు కొంటున్నాడు .

మత సామరస్యం సాధ్యమేనా ? (Part 4)

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ మాట్లాడుతూ .. “ఈ సినిమా షూటింగును అనుకున్న ప్రకారమే చేస్తూ వచ్చాము. మొదటిసారిగా ఈ సినిమాలో నేను సిక్స్ ప్యాక్ తో కనిపిస్తాను. ఇంతవరకూ వచ్చిన అవుట్ పుట్ చూసిన తరువాత ఈ సినిమాపై నాకున్న నమ్మకం మరింత పెరిగింది. నా జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తుండగా, కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపించనున్నారు. లాక్ డౌన్ తరువాత రెండు కొత్త ప్రాజెక్టులను గురించి చెబుతాను” అని అన్నాడు. చివరగా ఈ సినిమా గురించి చెబుతూ ఈ సారి తప్పకుండా హిట్ కొడతా అని ధీమా వ్యక్తం చేసాడు .

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper