https://oktelugu.com/

Nagarjuna: నాగార్జున పై పిచ్చి ప్రేమ పెంచుకున్న స్టార్ హీరో వైఫ్… ఆయన సినిమా రిలీజ్ అంటే చాలు అలా చేసేదట!

గతంలో కళ్యాణ్ రామ్ మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి వచ్చాడు. ఆ షో హోస్ట్ గా ఉన్న నాగార్జునకు తన భార్య స్వాతి గురించి చెప్పాడు కళ్యాణ్ రామ్.

Written By:
  • Neelambaram
  • , Updated On : October 30, 2023 4:58 pm
    Kalyan Ram wife die hard fan of Nagarjuna
    Follow us on

    Nagarjuna: మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల్లో ఇమేజ్ తెచ్చుకున్న హీరో నాగార్జున. ముఖ్యంగా ఆయన దశాబ్దాల పాటు అమ్మాయిల కలల రాకుమారుడిగా ఉన్నాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ తో లేడీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఇక నాగార్జున ఫ్యాన్స్ లో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఉన్నారు. హీరో కళ్యాణ్ రామ్ వైఫ్ స్వాతికి నాగార్జున అంటే ఎనలేని అభిమానం అట. ఆయన ప్రతి సినిమా తప్పక చూస్తారట.

    ఈ విషయాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా వెల్లడించారు. గతంలో కళ్యాణ్ రామ్ మీలో ఎవరు కోటీశ్వరుడు షోకి వచ్చాడు. ఆ షో హోస్ట్ గా ఉన్న నాగార్జునకు తన భార్య స్వాతి గురించి చెప్పాడు కళ్యాణ్ రామ్. నా భార్య స్వాతి మీకు పెద్ద అభిమాని. మన్మధుడు మూవీ రిలీజ్ టైం లో ఆమె కాలేజ్ కి వెళుతుందట. కాలేజ్ కి బంక్ కొట్టి మన్మధుడు మూవీకి వెళ్లిందట అని చెప్పాడు.

    మీ సినిమా విడుదలైందంటే కాలేజ్ డుమ్మాకొట్టి మరీ వెళ్లేదట అని కళ్యాణ్ రామ్ నాగార్జునతో అన్నారు. దాంతో నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. స్వాతిని నేను విష్ చేశానని చెప్పాలంటూ నాగార్జున కళ్యాణ్ రామ్ తో అన్నాడు. నందమూరి హీరో వైఫ్ అక్కినేని నాగార్జున వీరాభిమాని కావడం విశేషం అని చెప్పాలి. కాగా నాగార్జున, కళ్యాణ్ రామ్ సినిమాలు నెలల వ్యవధిలో విడుదల కానున్నాయి. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ డెవిల్ నవంబర్ 24న విడుదల కానుంది.

    ఇక విజయాలు లేక సతమతం అవుతున్న నాగార్జున నా సామిరంగ అంటూ సంక్రాంతి బరిలో దిగుతున్నాడు. ఇది అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్. మరోవైపు బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొడుతున్నారు. గత సీజన్లో విమర్శలు ఎదుర్కొన్న నాగార్జున ఈసారి ప్రశంసలు అందుకుంటున్నారు. వరుసగా ఐదోసారి ఆయన హోస్టింగ్ చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 7 ఎనిమిది వారాలు పూర్తి చేసుకుంది.