Cyber Crime: మూడు మిస్ట్ కాల్స్ వచ్చాయి.. బ్యాంకుల్లో డబ్బు మాయం అయింది.. లాయర్ కే ఇలా టోకరా వేసిన ఘనుడు..

ఇప్పటి వరకు ఆన్ లైన్ మోసాలు ఎన్నో జరిగాయి. కొందరు ఫోన్ చేసీ కేవైసీ పూర్తి చేస్తామంటూ వివరాలు అడిగారు.మరికొందరు ఫేస్బుక్ లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఆపదలో ఉన్నామని డబ్బులు అడిగేవారు.

Written By: Srinivas, Updated On : October 30, 2023 5:06 pm
Follow us on

Cyber Crime: కాలం మారుతున్న కొద్దీ టెక్నాలజీ పెరిగిపోతుంది. దీంతో కొన్ని పనులు సాంకేతికంగా చేసేందుకు టెక్నాలజీని వీపరీతంగా వాడుతున్నారు. అయితే కొందరు ఇదే అదనుగా భావించి టెక్నాలజీని ఉపయోగిస్తూ చాలా మోసాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆన్ లైన్ మోసాలు చేస్తూ అక్రమంగా దోచుకుంటున్నారు. ఖాతాదారులకు కొన్ని ఫొన్లు రావడం.. ఆటోమేటిక్ గా వారికి ఓటీపీ వివరాలు చెప్పడం ద్వారా తీవ్రంగా నష్టపోయారు. అయితే తాజాగా ఎలాంటి ఓటీపీ చెప్పకపోయినా ఖాతాలోని డబ్బులు మాయమయ్యాయి. అయితే అంతకుముందు మొబైల్ కు మూడు మిస్డ్ కాల్స్ వచ్చాయి. అంతే.. ఖాతా ఖాళీ అయింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇప్పటి వరకు ఆన్ లైన్ మోసాలు ఎన్నో జరిగాయి. కొందరు ఫోన్ చేసీ కేవైసీ పూర్తి చేస్తామంటూ వివరాలు అడిగారు.మరికొందరు ఫేస్బుక్ లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఆపదలో ఉన్నామని డబ్బులు అడిగేవారు. ఈ విషయాలు బయటపడడంతో చాలా మంది జాగ్రత్తపడుతున్నారు. ఈ తరుణంలో కొందరు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. కేవలం మూడు మిస్డ్ కాల్స్ ఇచ్చి ఆ తరువాత డబ్బులు గుంజేస్తున్నారు. ఒకవేళ ఈ కాల్స్ అటెమ్ట్ చేస్తే ఇంకా ముందుగానే డబ్బులు డెబిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ఢిల్లీకి చెందిన ఓ లాయర్ మొబైల్ కు మూడుసార్లు మిస్ట్ కాల్స్ వచ్చాయి. అయితే ఈ కాల్స్ అనుమానాస్పదంగా ఉండడంతో ఆమె ఈ నెంబర్ ఎందుకు వచ్చింతో తెలుసుకునే లోపే ఆమె బ్యాంకు ఖాతా నుంచి డబ్బలు డెబిట్ అయ్యాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి ఫిర్యాదు చేయడానికి రెడీ అయింది. ఇంతలో ఆమె ఖాతా నుంచి డబ్బులు పూర్తిగా మాయం అయ్యాయి. అయితే ఇదంతా తాను వాడుతున్న మొబైల్ నెంబర్ ఆధారంగా డబ్బలు మాయం అయినట్లు గుర్తించారు.

ఆమె ఓటీపీ ఎవరికీ ఇవ్వలేదు. కానీ డబ్బులు ఎలా పోయాయని ఈనెల 18న ఫిర్యాదు చేయగా.. అసలు విషయం బయటపడింది. ఓ సారి కొరియర్ సంస్థలో ఆమె తన చిరునామాతో పాటు తన ఫోన్ నెంబర్ ఇచ్చారు. దీనిని కొందరు స్వాహా చేసి అదే నెంబర్ పై ఫేక్ నెంబర్ తీసుకొని ఈ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఫేక్ నెంబర్ క్రియేట్ చేసిన తరువాత ఎవరి సహాయం అవసరం లేకుండా ఇలా బ్యాంకు ఖాతా ద్వారా డబ్బలు కొల్లగొట్టేస్తున్నారు. అయితే ఎవరైనా ఫోన్ చేసి పాన్ నెంబర్ వివరాలు అడిగినా చెప్పొద్దని పోలీసు అధికారులు చెబుతున్నారు.