Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు తల్లి ఇందిర ఇటీవల మరణించి శోకాన్ని మిగిల్చారు. ఆమె మరణంతో సీనియర్ స్టార్ హీరో కృష్ణ, మహేశ్ బాబు, మంజుల తదితరులు కుంగిపోయారు. ఆమె లేని లోటు పూడ్చలేనిదంటూ కొనియాడారు. ఈ సందర్భంగా మహేశ్ పరిస్థితిని చూసి ఫ్యాన్స్ కూడా హర్టయ్యారు. అయితే మహేశ్ పడిన బాధ అంతా ఇంతా కాదు. కానీ ఆయన కన్నీళ్లు వదల్చలేదు… కనీసం ఏడవలేదు.. ఇలా చేయడంపై మహేశ్ అక్క మంజుల సంచలన కామెంట్ చేశారు. మహేశ్ అలా చేయడానికి పెద్ద కారణమే ఉందని అన్నారు. ఇటీవల ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇంతకీ మంజుల అలా అనడానికి కారణం ఏంటి..?

చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో ఉన్నారు. తండ్రి కృష్ణ వారసత్వంతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా.. మహేశ్ సొంతంగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. బాల నటుడిగా.. హీరోగా మహేశ్ ఎన్నో సక్సెస్ సినిమాల్లో నటించారు. ఇప్పటికీ స్టార్ హీరోల్లో మహేశ్ ఒకరిగా ఉండడం విశేషం. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్న మహేశ్ ఫ్యామిలీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు. కాస్త టైం దొరికితే చాలు కుటుంబ సభ్యలతో గడిపేస్తాడు.
మహేశ్ కు తల్లి ఇందిర అంటే ప్రాణం. చివరి వరకు ఆమె బాగోగులు మహేశే చూసుకునేవారు. అయితే ఒక్కసారిగా తన తల్లి విడిచి వెళ్లిందని తెలియడంతో మహేశ్ కుప్పకూలాడు. ఆమె భౌతికాయం వద్ద మహేశ్ కూర్చొని ఆమెతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా మహేశ్ కన్నీళ్లు కార్చడం గానీ.. ఏడ్వడం గానీ కనిపించలేదు. దీంతో మహేశ్ కు అమ్మమీద ప్రేమ లేదా..? అని కొందరు అన్నారు. ఇలాంటి వారికి మహేశ్ అక్క ఘాటుగా సమాధానం చెప్పారు.

మహేశ్ కు తల్లి మాత్రమే కాదు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రాణమని మంజుల అన్నారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ నా బర్త్ డే సందర్భంగా మహేశ్ ఫోన్ చేస్తాడు.. కానీ విషెష్ చెప్పడు.. ఎలా ఉన్నావ్..? ఏంటి సంగతులు..? అని మాట్లాడుతాడు. అంటే నా బాగోగులను గుర్తు చేస్తాడు. అంటే బర్త్ డే విషెష్ చెప్పినంత మాత్రాన ప్రేమ ఉన్నట్లు కాదు.. ఆ రోజు నాతో మాట్లాడుతాడు.. అది చాలు కదా.. నాపై ఎంత ప్రేమ ఉందనేది..?’ అని మంజుల చెప్పింది.
అలాగే ‘మా అమ్మ చనిపోయినప్పుడు మహేశ్ ఏడ్వలేదు… అంతమాత్రాన అమ్మపై ప్రేమ లేదని కాదు.. తన ప్రేమంతా గుండెల్లో ఉంటుంది. ఏదైనా తనకోసం చేయాలన్న తపన మహేశ్ కు ఎప్పుడూ ఉండేది. కేవలం మదర్స్ డే రోజు విషేష్ చెప్పడం మహేశ్ స్టైల్ కాదు.. తన కోసం ప్రాణమైనా ఇచ్చే ప్రేమ మహేశ్ లోఉంటుంది.’ అని మంజుల అనడం చర్చనీయాంశంగా మారింది.