Hyper Aadi Assets: జబర్దస్త్ వేదికగా ఎదిగిన స్టార్స్ లో హైపర్ ఆది ఒకడు. టీం సభ్యుడిగా ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది లీడర్ అయ్యాడు. హైపర్ ఆది కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆది స్కిట్స్ రికార్డ్స్ నమోదు చేశాయి. యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ అందుకున్నాయి. జబర్దస్త్ చేస్తూనే ఆది ఢీ షోకి రావడం జరిగింది. అక్కడ కూడా ఆది కామెడీ ప్రత్యేకంగా నిలిచింది. మునుపటి కంటే ఢీ మెరుగైన టీఆర్పీ దక్కించుకోవడంలో దోహదం చేశాడు. కొన్నాళ్లుగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సందడి చేస్తున్నాడు. షో ఏదైనా ఆది ఉంటే ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అన్న బ్రాండ్ నేమ్ తెచ్చుకున్నాడు.

బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ ఆదికి సినిమా ఆఫర్స్ తెచ్చిపెట్టింది. ఆయనకు ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్స్ దక్కుతున్నాయి. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆది మేడ మీద అబ్బాయి, తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, వెంకీ మామ, సోలో బ్రతుకే సో బెటర్… ఇలా దాదాపు 20 చిత్రాల వరకు చేశాడు. మరికొన్ని ప్రాజెక్ట్స్ సెట్స్ పై ఉన్నాయి. నటుడిగా, యాంకర్ గా ఆది కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది.
సుడిగాలి సుధీర్ ఈటీవికి గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఆదికి అక్కడ పూర్తి ఆధిపత్యం దక్కింది. ప్రస్తుతం ఆదరణ కలిగిన ఢీ, జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో హైపర్ ఆదిదే హవా. వంటి చేత్తో మల్లెమాల కార్యక్రమాలను ఆది లాక్కొస్తున్నారు. మరి ఇంతలా చెలరేగిపోతున్న ఆది సంపాదన ఎంత? ఆయన ఎన్ని ఆస్తులు కూడబెట్టాడనే? సందేహం అందరి మదిలో మెదులుతుంది.

అందుతున్న సమాచారం ప్రకారం హైపర్ ఆది సంపాదన లక్షల నుండి కోట్లకు చేరిందట. సినిమాలు, బుల్లితెర షోలతో ఆయన రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ఆది హైదరాబాద్ లో కొనుగోలు చేసిన ఇంటి ఖరీదే రూ. 10 కోట్ల వరకు ఉంటుందట. అలాగే ఆది ఒంగోలు దగ్గర్లో గల సొంతూరిలో బాగా స్థిరాస్తులు కొన్నారట. జబర్దస్త్ కి రాకముందు మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఆది ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడనేది టాక్. ఒక కామెడీ షో ఆయన జీవితాన్నే మార్చేసింది. సామాన్యుడిని స్టార్ ని చేసింది.