
నేషనల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’లో సైడ్ పాత్రలో నటించడానికి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఎలా ఒప్పుకున్నాడా అని అందరిలో పెద్ద డౌట్ ఉంది. అయితే అజయ్ కి, ఆర్ఆర్ఆర్ లో తన పాత్ర బాగా నచ్చిందట. సినిమా మొత్తంలోనే ఆయనది కీలకమైన ఓ ఫ్రీడమ్ ఫైటర్ పాత్ర.. కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే అజయ్ కనిపించినా.. అజయ్ దేవగణ్ పాత్ర వల్లే ఎన్టీఆర్ – చరణ్ పాత్రలు తమ పోరాట విధానాన్ని మార్చుకుంటారని.. వారి పాత్రలకు ప్రధానంగా అజయ్ దేవగణ్ పాత్రనే ప్రేరణాత్మకంగా ఉండబోతుందని, అందుకే అజయ్ సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడని తెలుస్తోంది.
మోడీ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా?
ఇక అజయ్ దేవగణ్ నే తమ సినిమాలో ఎందుకు తీసుకున్నాననే విషయం గురించి ఇటివలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ.. ‘ఈయన చెబుతుంది కరెక్ట్.. ఈయన మాట్లాడిన మాట ప్రతిదీ నిజమే అని బలంగా అనిపించాలి. బాలీవుడ్ హీరోల్లో ఒక్క అజయ్ దేవ్‌గణ్ చెబితేనే అది మనకు నిజమే అనిపిస్తోంది. ఆయనకున్న ఇమేజ్ అలాంటిది. అందుకే అజయ్ దేవగణ్ ను ఆర్ఆర్ఆర్ లో తీసుకున్నాను అని’ రాజమౌళి చెప్పుకొచ్చాడు.
ఏపీ ఈఎస్ఐ స్కామ్ కు తెలంగాణకు సంబంధం ఏంటీ?
కాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంలా నటిస్తున్న ఈ చిత్రంలోని ముఖ్యమైన పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్ సన్ ను, అలాగే మరో కీలక పాత్ర కోసం ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు. ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. ఏది ఏమైనా రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు.