అమ్మ ‘తలైవి’తో శోభన్ బాబు లవ్ సీన్స్ ను.. !

తమిళ ప్రజల అభిమాన దివంగత ముఖ్యమంత్రి అమ్మ ‘జయలలిత’ జీవితంలో చోటు చేసుకున్న ఓ వివాదాస్పద విషయం ఆమెను జీవితాంతం ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అదే అలనాటి అమ్మాయిల కలల హీరో శోభన్ బాబుతో జయలలితకు ఏర్పడిన పరిచయం. ఆ రోజుల్లో శోభన్ బాబు – జయలలిత మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని అనేక రూమర్స్ వచ్చాయి. అయితే ఆ రూమర్స్ లో వాస్తవం ఎంత.. నిజంగానే వారి మధ్య ప్రేమ ఉందా.. నిజంగానే వాళ్లిద్దరికీ […]

Written By: admin, Updated On : June 22, 2020 7:24 pm
Follow us on


తమిళ ప్రజల అభిమాన దివంగత ముఖ్యమంత్రి అమ్మ ‘జయలలిత’ జీవితంలో చోటు చేసుకున్న ఓ వివాదాస్పద విషయం ఆమెను జీవితాంతం ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. అదే అలనాటి అమ్మాయిల కలల హీరో శోభన్ బాబుతో జయలలితకు ఏర్పడిన పరిచయం. ఆ రోజుల్లో శోభన్ బాబు – జయలలిత మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందని అనేక రూమర్స్ వచ్చాయి. అయితే ఆ రూమర్స్ లో వాస్తవం ఎంత.. నిజంగానే వారి మధ్య ప్రేమ ఉందా.. నిజంగానే వాళ్లిద్దరికీ ఓ పాప పుట్టిందా.. ? మరి ఏ కారణాల చేత వాళ్ళు పూర్తిగా దూరం అయ్యారు.

ముందుచూపుతో పరిహారం అందించిన కేసీఆర్..!

ఇలాంటి విషయాల గురించి జయలలిత జీవితం ఆధారంగా రానున్న ‘తలైవి’ బయోపిక్ లో మొదట చూపించాలనుకున్నారు. కానీ అమ్మ అభిమానులు మనోభావాలు దెబ్బ తింటాయని ఈ సినిమాలో శోభన్ బాబు పాత్రను చాల వరకూ తగ్గించబోతున్నారు. అయితే శోభన్ పాత్రను పూర్తిగా తగ్గిస్తారా లేక కొంత పార్ట్ వరకూ తగ్గిస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఏది ఏమైనా ‘అమ్మ’ అభిమానుల కోసం శోభన్ బాబుతో ఆమెకున్న అనుబంధం తగ్గించి చూపించడం బాగాలేదు.

తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ తప్పదా?

ఇక జయలలిత పాత్రలో బోల్డ్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కంగనా ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తమిళం కూడా నేర్చుకుంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తమిళ డైరెక్టర్ ‘ఏ ఎల్ విజయ్’ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో జయలలిత పై జరిగిన కుట్రల్లో ముఖ్యమంత్రి కరుణానిధి పాత్ర ఎంత ఉంది ? తమిళ రాజకీయాలను జయలలిత ఎలా శాసించగలిగింది ? విషయాలను ప్రధానంగా చూపించనున్నారు.