https://oktelugu.com/

అదే జరిగితే పూజా హెగ్డేకి తిరుగుండదు !

టాలీవుడ్ లో ప్రస్తుత లీడింగ్ హీరోయిన్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ‘పూజా హెగ్డే’నే. పూజా ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ ను బాగానే కవర్ చేస్తోంది. తెలుగులో వరుసగా పెద్ద స్టార్స్ తో నటిస్తూనే, బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ సక్సెస్ ఫుల్ స్టార్ అక్షయ్ కుమార్ చేస్తున్న ‘బచ్చన్ పాండీ’ చిత్రంలో పూజా హెగ్డే ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. […]

Written By:
  • admin
  • , Updated On : June 22, 2020 / 07:39 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో ప్రస్తుత లీడింగ్ హీరోయిన్స్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది ‘పూజా హెగ్డే’నే. పూజా ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ ను బాగానే కవర్ చేస్తోంది. తెలుగులో వరుసగా పెద్ద స్టార్స్ తో నటిస్తూనే, బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ సక్సెస్ ఫుల్ స్టార్ అక్షయ్ కుమార్ చేస్తున్న ‘బచ్చన్ పాండీ’ చిత్రంలో పూజా హెగ్డే ఛాన్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఫర్హద్ షామ్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ గా పూజా నటిస్తుందని అనుకున్నారు అందరూ.

    రేపటి నుంచి పూరీ రథయాత్ర.. సుప్రీం గ్రీన్ సిగ్నల్

    కానీ ‘పూజా హెగ్డే’ది కూడా మెయిన్ హీరోయిన్ రోల్ నని, సినిమాలో కృతి సనన్ కంటే కూడా పూజా హెగ్డేకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ కే ప్రస్తుతం లీడింగ్ హీరోగా ఉన్న అక్షయ్ కుమార్ లాంటి హీరో సినిమాలో మెయిన్ హీరోయిన్ అంటే.. పూజా హెగ్డేకి దశ తిరిగినట్టే. ఏమైనా లక్ అంటే ‘పూజా హెగ్డే’దే. గత సినిమా ‘అల వైకుంఠపురంలో’తో ఇండస్ట్రీ సూపర్ హిట్ ను దక్కించుకున్న ఈ టాల్ బ్యూటీ ప్రభాస్ సినిమాలో కూడా మెయిన్ లీడ్ చేస్తోంది.

    అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు

    పైగా త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమాలో కూడా ఈ బ్యూటీ నటించే ఛాన్స్ ఉందని ఇప్పటికే ఫిల్మ్ వర్గాల నుండి రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి అక్షయ్ కుమార్ సినిమాతో గాని బాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ సూపర్ హిట్ అందుకుంటే… ఇక పూజా హెగ్డేకి బాలీవుడ్ లోనూ తిరుగుండదు. అక్కడ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.