Homeఎంటర్టైన్మెంట్SSMB 29: ఎస్ఎస్ఎంబి షూటింగ్ లొకేషన్ ఇదే, సోషల్ మీడియాను ఊపేస్తున్న పిక్స్.. మహేష్ ఫ్యాన్స్...

SSMB 29: ఎస్ఎస్ఎంబి షూటింగ్ లొకేషన్ ఇదే, సోషల్ మీడియాను ఊపేస్తున్న పిక్స్.. మహేష్ ఫ్యాన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్!

SSMB 29: రాజమౌళి సినిమా అంటే విడుదలకు ముందు ఓ రెండేళ్లు.. విడుదల తర్వాత ఓ రెండేళ్లు ట్రెండ్ అవుతూనే ఉంటుంది. వార్తల్లో నిలుస్తుంది. ఆయన సినిమాల పట్ల జనాల్లో ఉండే క్రేజ్ అలాంటిది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ కావడంతో అంచనాలు పీక్స్ కి చేరాయి. కాగా రాజమౌళి ఈ సినిమా డీటెయిల్స్ షేర్ చేయడం లేదు. లాంచింగ్ సెరిమోని రహస్యంగా జరిపారు. మీడియాను అనుమతించలేదు. అలాగే గుట్టుగా ఓ షెడ్యూల్ సైతం కంప్లీట్ చేశారు. హైదరాబాద్ నగర శివారులో ఏర్పాటు చేసిన సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు సమాచారం.

Also Read: ఎస్ఎస్ఎంబి 29, మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి… అయితే అదే పెద్ద సస్పెన్సు!

నెక్స్ట్ లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు రాజమౌళి. దీనికి సంబంధించిన సమాచారం లీకైంది. SSMB 29 జంగిల్ అడ్వెంచర్ డ్రామా. ఈ క్రమంలో ఒడిశా రాష్ట్రంలో గల డియోమలి, తలమలి, కల్యమలి అనే హిల్ స్టేషన్స్ లో షూటింగ్ కి ప్రణాళిక వేశారు. పచ్చని కొండలతో కూడిన ఈ బ్యూటిఫుల్ సీనిక్ ఏరియాలో చిత్రీకరణ జరపనున్నారు. ఇప్పటికే మహేష్ బాబు ఒడిశా రాష్ట్రానికి పయనమయ్యారు. ఆయన ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. కొన్ని రోజుల పాటు అక్కడే షూటింగ్ జరగనుంది.

SSMB 29 షూటింగ్ లొకేషన్ ఇదే అంటూ కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అవి ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. కాగా ఏప్రిల్ నెలలో ప్రెస్ మీట్ ఉంటుందట. రాజమౌళి, మహేష్ బాబు తో పాటు నిర్మాతలు పాల్గొనే ఈ ప్రెస్ మీట్ నందు ప్రాజెక్ట్ కి సంబంధించిన సమాచారం పంచుకుంటారని తెలుస్తుంది. మరొక అప్డేట్ ఏంటంటే.. మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్ చేస్తున్నారట. విలన్ రోల్ అని ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇండైరెక్ట్ గా పృథ్విరాజ్ చేసిన కామెంట్, దీనిపై స్పష్టత ఇచ్చింది.

ఇక హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి SSMB 29 చిత్రాన్ని రూ. 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రెండేళ్లకు పైగా చిత్రీకరణ జరుపుకోనుంది ఈ చిత్రం. విజయేంద్ర ప్రసాద్ కథను సమకూర్చారు. ప్రపంచాన్ని చుట్టే వీరుడిగా మహేష్ పాత్ర ఉంటుందట. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని రాజమౌళి తెలియజేశారు.

 

Also Read: అమెజాన్ ప్రైమ్ కి ఊహించని షాక్ ఇచ్చిన దిల్ రాజు..’గేమ్ చేంజర్’ హిందీ వెర్షన్ విడుదల అయ్యేది ఆ ఓటీటీ లోనే

RELATED ARTICLES

Most Popular