Dil Raju: దిల్ రాజుకు ఈ మధ్య టెన్షన్ ఎక్కువ అయ్యింది. తెలుగుతో పాటు హిందీలోనూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. మరోపక్క ఆ సినిమాలు భారీ ప్లాప్స్ అవుతున్నాయి. అందుకే, మరి కొన్ని రోజుల్లో విడుదల కానున్న తన ‘థాంక్యూ’ సినిమా పై దిల్ రాజు బాగా టెన్షన్ పడుతున్నాడు. మరోపక్క దిల్ రాజు సంస్థలో చాలా గొంతులు పైకి లేస్తున్నాయి. తన రెండో పెళ్లి తర్వాత.. దిల్ రాజు తమ్ముడు, కూతురు కూడా ఆయనకు నమ్మిన బంటుగా ఉండటం లేదు. ఆర్థికపరమైన లెక్కల్లో ఎన్నో తేడాలు జరుగుతున్నాయి.
ఆ తేడాలు ఏమిటో దిల్ రాజుకు తెలుసు. కానీ, ఎవరిని ఏమి అనలేని పరిస్థితి ఆయనది. ఇలాంటి తలనొప్పుల మధ్య దిల్ రాజు తన థాంక్యూ సినిమాని రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. తన పెట్టుబడిని రాబట్టాలి అనేది దిల్ రాజు ప్లాన్. ఎలాగూ నాగ చైతన్యకి భారీ మార్కెట్ లేదు. పైగా ఈ చిత్రంలో మూడు భిన్న గెటప్స్ లో నాగ చైతన్య కనిపించబోతున్నాడు. ఇది ప్రయోగం.
Also Read: Neha Shetty- NTR: ఎన్టీఆర్ కు మరదలిగా ‘డీజే టిల్లు’ హీరోయిన్.. ఇక రచ్చ రచ్చే
అందుకే, ఇలాంటి సినిమాకి భారీగా టికెట్ రేట్లు ఉంటే అసలుకే మోసం వస్తోందని దిల్ రాజుకు భయం పట్టుకుంది. అందుకే, థాంక్యూ సినిమా టికెట్ రేట్లను ఎక్కువ పెంచడానికి దిల్ రాజు ఆసక్తి చూపించలేదు. తమ్ముడు శిరీష్ ఈ విషయంలో దిల్ రాజుతో వాగ్వాదానికి కూడా దిగాడు. పైగా, దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి కూడా శిరీష్ వైపే మాట్లాడుతుంది. అయినా, దిల్ రాజు మాత్రం వెనక్కి తగ్గలేదు.
తన అనుభవంతో ఈ సినిమాకి టికెట్ రేట్లు ఫిక్స్ చేస్తున్నాను అని, దయచేసి ఈ విషయంలో ఎవ్వరూ జోక్యం చేసుకోవద్దు అంటూ టికెట్ రేట్లు ఫిక్స్ చేశాడు. తెలంగాణలో థియేటర్ టికెట్ రేట్స్ ను వెల్లడించాడు. మల్టీప్లెక్స్ కు 177, సింగిల్ స్క్రీన్ కు 112 రూపాయల ధరలను దిల్ రాజు నిర్ణయించాడు. ఇప్పుడు ఈ నిర్ణయానికి దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి అయిష్టంగా ఉన్నారు.
ఆమె స్వయంగా మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ ను 250 కు పెంచేలా థియేటర్ల యాజమాన్యంతో మాట్లాడుతుంది. హర్షిత రెడ్డి కి సపోర్ట్ గా ‘దిల్ రాజు తమ్ముడు’ శిరీష్ కూడా ఉన్నాడు. మొత్తానికి ఇన్నాళ్లు ఎదురే లేని వ్యక్తిగా వెలిగిపోయిన దిల్ రాజు సామ్రాజ్యంలో ఆధిపత్య పోరు మొదలైంది. కాకపోతే దిల్ రాజు ఇంకా ఫామ్ లో ఉండాగానే ఆయన పై ఇలా సొంత మనుషులే తిరుగుబాటు చేయడం కొసమెరుపు. మరి దిల్ రాజు ఏమి చేస్తాడో చూడాలి.
Also Read:Difference Between Baahubali and RRR: బాహుబలికి, ఆర్ఆర్ఆర్ కు మధ్య తేడా అదే.. అక్కడే తేడా కొట్టింది!