Homeజాతీయ వార్తలుIndian Rupee Futures: భవిష్యత్ మన రూపాయిదే రూల్‌.. డాలర్‌కు చెక్‌పెట్టే యోచనలో భారత్‌

Indian Rupee Futures: భవిష్యత్ మన రూపాయిదే రూల్‌.. డాలర్‌కు చెక్‌పెట్టే యోచనలో భారత్‌

Indian Rupee Futures: రూపాయి పతనం.. ఇటీవల నిత్యం ఏ న్యూస్‌ చూసినా.. ఏ దినపత్రిక చదివనినా కనబడే.. వినబడే వార్త ఇది. కారణం ఏదైనా కావొచ్చు.. డాలర్‌తో పోల్చితే మన రూపాయి విలువ కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా మనం దిగుమతులకు అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తోంది. పెట్రో ఉత్సత్తుల ధరలు, నిత్యావసరాల ధరలు, ఎలక్ట్రానిక్స్‌ ధరలు, ముఖ్యంగా దిగుమతి చేసుకునే చాలా వస్తువలు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో ఆధిపత్యం చెలాయిస్తున్న డాలర్‌తో చాలా దేశాల కరెన్సీ ధరలు పతనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ డాలర్‌ డాంబీకానికి చెక్‌పెట్టే ప్రయత్నాలు చేశారు. ప్రపంచ వాణిజ్యంలో మన రూపాయి రూల్‌ చేసే చర్యలకు ఆర్బీఐ ద్వారా ఇప్పటికే చర్యలు చేపట్టారు.

Indian Rupee Futures
Indian Rupee

నేపాల్, భూటాన్‌లోనే మన రూపాయి చెల్లుబాటు..
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మన రూపాయి నేపాల్, భూటాన్‌లో మాత్రమే చెల్లుబాటు అవుతోంది. మనతో వాణిస్య సంబంధాలు కొనసాగించే ఇతర ఏ దేశాలు కూడా మన రూపాయిని అంగీకరించడం లేదు. దీంతో ఎగుమతులు, దిగుమతులకు సబంధించిన చెల్లింపులన్నీ డాలర్లలోనే జరుగుతున్నాయి. మన దేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాలు డాలర్, పౌండ్, లేదా యూరోల్లోనే వాణిజ్య కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఫలితంగా ఆయా దేశాల కరెన్సీ డాలర్‌కు అనుగుణంగా చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఎనిమిదేళ్లగా మన రూపాయి విలువ తగ్గుతూ వస్తోంది. ఈసారి రికార్డు స్థాయిలో డాలర్‌తో పోలిస్తే రూ.80 పడిపోయింది. దీని ఫలితంగా మనం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు మండిపోతున్నాయి. విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయి.

Also Read: Rupee Value: అమ్మో రూపాయి.. మోదీ పాలనలో రికార్డుస్థాయిలో పతనం

రూపాయి విలువ పెంపునకు చర్యలు..
ఇప్పటి వరకు పడిపోవడం తప్ప పెరగడం తెలియని రూపాయి విలువ పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. కేంద్రం ఆదేశాలతో ఆర్‌బీఐ రంగంలోకి దిగింది. ప్రపంచంలో ఏ దేశానికైనా చెల్లింపులు ఇకపై రూపాయల్లోనే జరిపేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని ఆర్‌బీఐ అన్ని బ్యాంకులను ఆదేశించింది. ఈమేరకు నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. మన వ్యాపారులు, మన దేశంలో పెట్టుబడులు పేట్టే వ్యాపారులు కూడా రూపాయల్లో చెల్లింపులు జరిపేందుకు ఆసక్తి చూసిస్తున్నారు.

ఎగుమతులు.. దిగుమతులన్నీ రూపాయల్లోనే..
ప్రపంచ వాణిజ్యంలో చెల్లంపులు, ఎగుమతులు, దిగుమతులకు సబంధించిన చెల్లింపులో రూపాయల్లో జరిపేందుకు బ్యాంకులు రిజర్వు బ్యాంకులోని ఫారిన్‌ ఎక్సెంజి డిపార్ట్‌మెంట్‌ నుంచి నుంచి అనుమతులు తీసుకోవాలని ఆర్‌బీఐ తెలిపింది. ప్రంచంలోని ఏ దేశంతోనైనా బ్యాంకులు నేరుగా లావాదేవీలు జరిపేందుకు వోస్టో ఖాతాలు తెరవడానికి ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది. ఏదైనా ఒక బ్యాంకుకు ఇతర బ్యాంకుల్లో ఖాతా ఉండడాన్నే వోస్టో అంటారు. ఈ విధానం ద్వారా భారత్‌కు దిగుమతులు జరిపేవారు రూపాయల్లో చెల్లింపులు చేస్తారని స్పష్టం చేసింది. ఎగుమతులు, దిగుమతులకు సబంధించిన చెల్లింపులు లావాదేవీలన్నీ ఇకపై సాధారణ నిబంధనలకు లోబడే ఉంటాయని తెలిపింది. ఇక వోస్టో ఖాతాల్లోని నగదు, పెట్టుబడుల చెల్లింపు, ప్రాజెక్టుల నిర్మాణానికి వినియోగించవచ్చని ఆర్బీఐ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వాణిజ్య, భాగస్వామ్య దేశాల్లోని బ్యాంకుల్లో కూడా ఈమేరకు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా భారత్‌ చెల్లింపులు డాలర్లలో కాకుండా రూపాయల్లో చెల్లించడానికి వీలుంటుంది.

Indian Rupee Futures
Indian Rupee

ప్రస్తుతం రష్యాకు రూపాయల్లో చెల్లింపులు..
ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో అమెరికా రష్యాకు డాలర్లు అందుబాటులో లేకుండా చేస్తోంది. ఈ పరిస్థితి మన వ్యాపారులకు, దిగుమతలుకు మంచి అవకాశంగా మారింది. ప్రస్తుతం రష్యా నుంచి చేసుకుంటున్న దిగుమతులన్నింటికీ భారత్‌ రూపాయల్లోనే చెల్లింపులు జరుపుతోంది. ఈ ప్రత్యేక పరిస్థితిని భవిష్యతలో కొనసాగించేందుకు రిజర్వు బ్యాంకు చర్యలు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశాలలో రూపాయి ద్వారా లావాదేవీలు, చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకుంటోంది. తద్వారా మన దేశంలోని విదేశీ మారక నిల్వలు తగ్గిపోకుండా కాపాడడంతోపాటు మన రూపాయి విలువ ప్రపంచ మార్కెటలో బలోపేతం కావడానికి ఈ నిర్ణయం దోహద పడుతుందని రిజర్వు బ్యాంకు భావిస్తోంది. ప్రస్తుం ఉన్నఫలంగా ఇది జరుగకపోయినా భవిష్యత్‌లో రూపాయి కచితంగా బలపడుతుందని మాత్రం చెప్పవచ్చు. దీంతో మన రూపాయి ప్రపంచ వాణిజ్యాన్ని రూల్‌చేసే స్థాయికి ఎదుగుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

Also Read:MP Arvind- CM KCR కేసీఆర్ కు భయపడిపోతున్న ఎంపీ అరవింద్.. సంచలన నిర్ణయం

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version