Lokesh Kanagaraj-Sukumar: తమిళంలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన లోకేష్ కనకరాజ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఆయన చేసిన విక్రమ్ సినిమాతో ఇండియా వైడ్ గా ఒక భారీ సంచలనాన్ని సృష్టించడమే కాకుండా ఇండియాలోనే వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్ గా కూడా ఎదిగాడు. ప్రస్తుతం ఆయన రజినీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తుందనే ఉద్దేశ్యంతో అటు రజనీకాంత్, ఇటు లోకేష్ కనకరాజ్ ఇద్దరు మంచి నమ్మకం తో ఉన్నట్టుగా తెలుస్తుంది.
అలాగే గత సంవత్సరం జైలర్ సినిమాతో హిట్టు కొట్టిన రజిని కాంత్ ఈ సంవత్సరం ఈ సినిమాతో భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అంటూ తన అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉంటే సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక పుష్ప సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి సుకుమార్ ప్రస్తుతం వరుస సక్సెస్ లను చేస్తూ సక్సెస్ లను అందుకునే రీతిలో ముందుకు సాగుతున్నాడు…
ఇక లోకేష్ కనకరాజ్ సినిమాలు చాలా ఫాస్ట్ గా ముందుకు వెళ్తూ ఉంటుంది. అందువల్ల ఆ సినిమాలు చూసే అభిమానులకి చాలా కొత్తగా ఫ్రెష్ ఫీల్ తో సినిమా ముందుకు సాగుతుందనిపిస్తుంది. ఇక సుకుమార్ సినిమాలో మాత్రం ఇంటలిజెన్స్ కి ఎక్కువ ప్రియార్టీ ఇస్తూ ఉంటాడు. ప్రతి సీన్లో తను సినిమా తాలూకు ఏదో ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానివల్ల సినిమా చూసే ప్రేక్షకుడికి కొన్నిసార్లు బోర్ కొట్టించినట్టు అనిపించినప్పటికీ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత చూసుకుంటే దర్శకుడి టాలెంట్ ని మెచ్చుకోకుండా ఉండలేము.
Also Read: Kalki Movie: కల్కి మూవీ: కంటెంట్ లో స్ట్రాంగ్ .. ప్రమోషన్స్ లో వీక్..?
ఇక లోకేష్ కనకరాజ్ కి సుకుమార్ కి మధ్య తేడా ఏంటి అంటే లోకేష్ కనకరాజు చాలా గ్రాండ్ గా సినిమాని తీసి సక్సెస్ చేయాలనుకుంటాడు.కానీ సుకుమార్ మాత్రం కథ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ సినిమాని ముందుకు తీసుకెళ్తుంటాడు. ఇక వీళ్లిద్దరి మధ్య ఉన్న తేడా ఇదే ప్రస్తుతానికి ఇద్దరు కూడా పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపు పొందుతూ ముందుకు సాగుతున్నారు…