india vs zimbabwe 2024: టి20 వరల్డ్ కప్ తర్వాత.. భారత జట్టు జింబాబ్వేలో పర్యటించనుంది. ఇందులో భాగంగా టి20 సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు శుభ్ మన్ గిల్ సారధ్యం వహిస్తాడు. గత కొద్దిరోజులుగా తీరికలేని ఆట ఆడుతున్న సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి.. పూర్తిగా జూనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం కల్పించింది. టి 20 టోర్నీలో భారత్ 5 మ్యాచ్లు ఆడుతుంది. ఈ మ్యాచ్ లు మొత్తం జింబాబ్వే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 నిమిషాలకు మ్యాచ్ లు మొదలవుతాయి. జూలై 7న తొలి మ్యాచ్ జరుగుతుంది. జూలై 14తో సిరీస్ పూర్తవుతుంది.
ఈ సిరీస్ కు బీసీసీఐ అనేక ప్రయోగాలు చేసింది. సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, పూర్తిగా యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది.. టి20 ప్రపంచ కప్ లో ప్లేయింగ్ -11 లో ఉన్న ఏ ఒక్క ఆటగాడికి కూడా ఈ సిరీస్ లో బీసీసీఐ అవకాశం కల్పించలేదు. ఇక తెలుగు కుర్రాడు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడు నితీష్ రెడ్డికి ఈ సిరీస్ లో అవకాశం దక్కింది. ఇతడితోపాటు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు చెందిన తుషార్ దేశ్ పాండే, రాజస్థాన్ జట్టుకు చెందిన రియాన్ పరాగ్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన అభిషేక్ శర్మ ఆటగాళ్లకు అవకాశం దక్కింది.. జితేష్ శర్మ, సంజు సాంసన్ కు వికెట్ కీపర్లుగా అవకాశం లభించింది. ఈ సిరీస్ లో ఐదు టి 20 మ్యాచ్ లు ఉన్నాయి.
ఈ సిరీస్ లో మరో ఆటగాళ్లు భారత జట్టులోకి పున: ప్రవేశం పొందారు. రుతురాజ్ గైక్వాడ్ కు మరో అవకాశం దక్కింది. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, పేసర్ ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్ కు మళ్లీ స్థానం దక్కింది.. అయితే కేఎల్ రాహుల్ కు మాత్రం అవకాశం లభించలేదు. టి20 వరల్డ్ కప్ లోనూ అతడికి స్థానం లభించలేదు. జింబాబ్వే పర్యటనకు కూడా అతడిని పరిగణలోకి తీసుకోలేదు.
జింబాబ్వేలో పర్యటించే
భారత జట్టు ఇదే
శుభ్ మన్ గిల్(కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్, తుషార్ దేశ్ పాండే.
ఇక ఈ సిరీస్ లో భాగంగా జులై 6న మొదటి టీ20, ఏడవ తేదీన రెండవ టి20, పదవ తేదీన మూడో టి20, 13వ తేదీన నాలుగో t20, 14న ఐదవ టి20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లు మొత్తం హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయి.