Businessman: మంచి జీవితం కావాలని అనుకునే వారికి ఉద్యోగం లేదా వ్యాపారం చాలా మంచి మార్గమని కొందరు నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్నాళ్లు ఉద్యోగం చేసిన తర్వాత సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొంతవరకు డబ్బు కూడా పెట్టుకుని ఆ తర్వాత వ్యాపారం ప్రారంభిస్తారు. అయితే ఉద్యోగం చేసే సమయంలో బరువు, బాధ్యతలు తక్కువగా ఉంటాయి. ఒక్కో రోజు పనిచేసినా.. చేయకపోయినా.. జీతం వస్తుంది. కానీ వ్యాపారంలో మాత్రం ప్రతిరోజు కచ్చితంగా పనిచేయాల్సిందే. అయితే కాస్త రిస్కు తీసుకొని ముందుకు వెళితే ఉద్యోగం కంటే వ్యాపారంలోనే ఎక్కువగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక గోల్ ఏర్పాటు చేసుకున్న వారు వ్యాపారంలో మాత్రమే సాధించగలరు. అంతకుముందు వ్యాపారం చేసే వారికి కొన్ని ప్రధానమైన లక్షణాలు ఉండాలి. అందులో ఇది తప్పనిసరిగా ఉండాలి. అదేంటంటే?
Also Read: చంద్రబాబు ప్రభుత్వం పై మరో బాంబు పేల్చిన ఆర్కే
రిస్క్ చేస్తే రిజల్ట్ ఉంటుంది.. అని పెద్దలు ఊరికే చెప్పలేదు. వ్యాపారంలో ఎంత కష్టపడితే అంత లాభం పొందే అవకాశం ఉంటుంది. అయితే కష్టానికి తోడుగా మరికొన్ని లక్షణాలను వ్యాపారులు కలిగి ఉండాలి. వీటిలో ఆవిష్కరణ ఒకటి. తాము ఏ వ్యాపారం చేయాలని అనుకుంటున్నారో.. తమ వ్యాపారం ఎదుటివారికి ఎలా ఉపయోగపడుతుందో.. తెలియజెప్పే వాక్చాతుర్యం తప్పనిసరిగా వ్యాపారులకు ఉండాలి. తమ వ్యాపారం గురించి ఎదుటివారికి విపులంగా చెప్పగలిగే లక్షణం ఉంటే వారి వ్యాపారం కచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది.
వ్యాపారులకు ఉండాల్సిన మరో ప్రధాన లక్షణం ఓర్పు. వ్యాపారం ప్రారంభించగానే లాభాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఒక్కోసారి ఇది వృద్ధి చెందడానికి ఏడాది పట్టొచ్చు.. లేదా రెండేళ్లు పట్టొచ్చు. అలా కొన్నాళ్లపాటు ఎదురుచూసే ఓర్పు ఉంటేనే వ్యాపారంలో విజయం సాధించగలం. ఏడాదిలోపే తమకు లాభాలు రావడం లేదని వ్యాపారాన్ని మూసివేస్తే అనుకున్న స్థాయికి ఎన్నటికి చేరలేరు.
వ్యాపారం అంటే కుటుంబ బాధ్యతను తీసుకున్న విధంగా ఉంటుంది. వీరికి ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కోసారి సమయానికి చేతిలో డబ్బులు కూడా ఉండవు. కానీ వస్తువులు అందుబాటులో లేకపోతే వినియోగదారులు తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఇలాంటి సమయంలో డబ్బులు తీసుకువచ్చే కమ్యూనికేషన్ ఉండాలి. అవసరానికి డబ్బు ఇచ్చే వారిని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా యాక్టివ్గా ఉంటేనే వ్యాపారంలో రాణించగలరు.
అన్ని వ్యాపారాలు ఒకేలా ఉండవు.. అందరూ ఒకే వ్యాపారం చేయలేరు. కొన్ని వ్యాపారాలు ప్రమాదకర పరిస్థితుల్లో కూడా చేయాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో ధైర్యంగా ముందుకు వెళ్తేనే విజయం సాధించగలరు. ప్రతి ఒక్క వ్యాపారుడికి ధైర్యం తప్పనిసరిగా ఉండాలి.
ఇక ప్రతి వ్యాపారికి తప్పనిసరిగా ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం.. ఎదుటివారిని ఆకట్టుకోవడం. ఒక్కోసారి వినియోగదారుడు నుంచి ప్రతికూలమైన వాతావరణం ఎదురవుతూ ఉంటుంది. కొందరు పెద్దలు చెబుతున్న ప్రకారం ఒక్కోసారి వినియోగదారుడు చీ కొట్టినా.. కాలితో తన్నినా.. ఓర్చు కోవాలి. ఇలాంటి సమయంలో వారిని కాలికి దెబ్బ తగిలిందేమో అన్నట్లుగా ప్రేమగా చూడాలి.. అప్పుడే వ్యాపారంలో రాణించగలరు. అంటే ఇక్కడ చెప్పాల్సిన ప్రధాన విషయం ఏంటంటే ప్రతి వ్యాపారుడికి ఎదుటివారి నుంచి కచ్చితంగా ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి. వాటిని తట్టుకొని ముందుకు వెళ్లడమే విజయవంతమైన వ్యాపారుడి లక్షణం. ఇది తప్పనిసరిగా ఉండాలి అని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.