Pradosha Kalam: జీవితంలో అన్నీ అనుకూలమైన పనులు జరగాలని కోరుకుంటూ ఉంటారు.. అయితే ఇందుకు దైవానుగ్రహం ఉండాలని కొంతమంది చెబుతూ ఉంటారు. దైవానుగ్రహం పొందడానికి సాధారణంగా కాకుండా ప్రత్యేక సమయంలో పూజలు చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు. అంటే ఉదయం, సాయంత్రం కాకుండా ప్రదోషకాలంలో పూజలు చేయడం వల్ల ఎన్నో విశేష ఫలితాలను పొందవచ్చని అంటున్నారు. ఈ సమయంలో శివారాధన చేయడం వల్ల అనుకున్న ఫలితాలు సాధించడమే కాకుండా.. అనేక కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అసలు ప్రదోషకాలం అంటే ఏమిటి? ఈ సమయంలో ఏం చేయాలి?
Also Read: చంద్రబాబు ప్రభుత్వం పై మరో బాంబు పేల్చిన ఆర్కే
శివుడి ఆజ్ఞా లేనిదే చీమైనా కొట్టదు అంటారు. అలాగే మనుషులు చేసే ప్రతి కార్యంలో శివుడి ఆజ్ఞ తప్పనిసరిగా ఉంటుందని అంటారు. అయితే ఆ శివుడి అనుగ్రహం పొందాలంటే ఆ స్వామికి ఇష్టమైన సమయంలో పూజలు చేయాలని చెబుతారు. శివుడికి ప్రదోషకాలం అంటే ఎంతో ప్రీతి అని చెబుతారు. ఈ సమయంలో కేవలం శివారాధన చేయడం వల్ల కూడా అనుగ్రహం పొందవచ్చు అని అంటున్నారు. సూర్యాస్తమానికి ముందు ఉండే కాలాన్ని ప్రదోషకాలం అంటారు. అంటే సాయంత్రం 4 లేదా 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఉండే కాలాన్ని ప్రదోషకాలం అని పేర్కొంటారు. ప్రదోషకాలం ప్రతిరోజు ఉన్నా.. కొన్ని రోజుల్లో మాత్రమే శివారాధన చేయడం వల్ల ఈశ్వరుడి అనుగ్రహం పొందవచ్చు అని అంటున్నారు.
త్రయోదశి, చతుర్దశి రోజున ప్రదోషకాలం సమయంలో శివారాధన చేయడం వల్ల చాలా మంచిది. త్రయోదశికి మన్మథుడు అధిపతిగా ఉంటాడు. చతుర్దశికి కలి అధిపతిగా ఉంటాడు. వీరి ఇరువురిని శివుడు మాత్రమే నియంత్రిస్తాడు. మన్మథుడు, కల్కి ప్రభావం వల్ల మనుషులు అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. వీటి నుంచి బయటపడడానికి త్రయోదశి, చతుర్దశి రోజున ప్రదోషకాలంలో శివుడి పూజ చేయాలి. ఈరోజుల్లో సాధ్యం కాకపోతే బుధ, గురువారాల్లో ప్రదోషకాలంలో శివ పూజా చేయవచ్చు. బుధ, గురువారాలు బుద్ధికి సంకేతం గా భావిస్తారు. అందుకే ఆయా రోజుల్లో శివ పూజ చేయడం వల్ల అనుకున్న ఫలితాలు సాధించవచ్చు.
అయితే ప్రదోషకాలంలో ప్రత్యేకంగా పూజ గదిని శుభ్రపరచి శివారాధన చేయవచ్చు. ఇది సాధ్యం కాని వారు కేవలం ఓం నమశ్శివాయ అని అనుకున్నా.. సరైన ఫలితాలు ఉంటాయని అంటున్నారు. మిగతా రోజుల్లో చేసే శివ పూజ కంటే ప్రదోషకాలంలో చేసే ఆరాధనతో శివుడు ఎంతో ఇష్టపడతాడని చెబుతున్నారు. అయితే ఈ పూజ సమయంలో నిష్టతో ఉండాలని అంటున్నారు. మనసులో ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా శివారాధన చేయాలని చెబుతున్నారు. శివుడి అనుగ్రహం పొందిన వారు ఎలాంటి కష్టాలనైనా చేదించగలిగే బలాన్ని పొందుతారు.