New Business: ఉద్యోగం కంటే వ్యాపారం చాలా బెటర్ అని కొంతమంది అభిప్రాయం. తక్కువ సమయంలో అధికంగా డబ్బు సంపాదించడానికి.. అనుకున్న జీవితం పొందడానికి వ్యాపారమే సరైన మార్గం అని అంటారు. అయితే వ్యాపారం ప్రారంభించడం అంటే ఆషామాసి కాదు. ఎంతో ఓర్పు ఉండాలి. ధైర్యం, కమ్యూనికేషన్ బాగుండాలి. అయితే వ్యాపారానికి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా.. ఏ వ్యాపారం ప్రారంభించాలి? అనే సందేహం చాలా మందికి వస్తుంది. కొంతమంది వ్యాపారం కోసం పర్యటనలు చేస్తూ ఉంటారు. అయితే వ్యాపార రంగ నిపుణులు ఎలాంటి వ్యాపారం చేస్తే సక్సెస్ అవుతుందో చెబుతున్నారు. వాటిలో కొన్ని బిజినెస్ ఐడియాలు మీకోసం..
Also Read: చంద్రబాబు ప్రభుత్వం పై మరో బాంబు పేల్చిన ఆర్కే
ఒక ప్రదేశంలో స్కూల్ ఉందనుకోండి. అక్కడ విద్యార్థులకు అవసరమయ్యే స్టేషనరీ వ్యాపారం ప్రారంభిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాగే ఆట వస్తువులు.. కిరాణం షాప్ పెడితే కచ్చితంగా రాణిస్తారు. ఎందుకంటే పిల్లల అవసరాలకు సంబంధించిన వస్తువులు అందుబాటులో ఉంటే కచ్చితంగా వాళ్ళు కొనుగోలు చేస్తుంటారు. దీంతో ఈ వ్యాపారం విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
షాపింగ్ మాల్ కు వచ్చేవారి సంఖ్య రోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా కార్లలో ఎక్కువ శాతం షాపింగ్ మాల్స్ కు వస్తూ ఉంటారు. అయితే ఈ షాపింగ్ మాల్స్ కు ఎదురుగా కార్ వాషింగ్ సెంటర్ పెడితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే షాపింగ్ చేసేలోపు కార్ వాషింగ్ చేయించుకోవాలని చాలామంది అనుకుంటారు. దీంతో రెండు పనులు అయిపోతాయని భావిస్తారు. ఈ క్రమంలో ఒకసారి వాషింగ్ సెంటర్ కు వస్తే.. వారితో స్నేహపూర్వకమైన కమ్యూనికేషన్ ఉంటే.. మరోసారి ఇక్కడికే రప్పించే ప్రయత్నం చేయవచ్చు.
ప్రతిరోజు వర్కౌట్ చేయడం చాలా మందికి అలవాటు. ఉదయం లేదా సాయంత్రం జిమ్ సెంటర్కు వెళ్లి శారీరక వ్యాయామం చేస్తూ ఉంటారు. ఇలాంటి జిమ్ సెంటర్లో ఎదురుగా ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలను ఏర్పాటు చేయడం వల్ల సేల్స్ ఎక్కువగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జిమ్ పూర్తయిన తర్వాత ఏదైనా ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. ఇలాంటి సమయంలో గుడ్లు లేదా ఇతర ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను అందుబాటులో ఉంచితే ఎక్కువగా సేల్స్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఒక వస్తువు ఎక్కువగా అమ్ముడు పోవడంలో చిన్నారుల పాత్ర ఎక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలను ఆకర్షించే కొన్ని వస్తువులను డిస్ప్లేలో ఉంచడం వల్ల తొందరగా రియాక్ట్ అవుతారు. అయితే చిన్న పిల్లలను ఆకర్షించే వస్తువులను ఆసుపత్రి ముందు ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువగా సేల్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వివిధ రకాల బొమ్మలను ఇక్కడ విక్రయించడం ద్వారా వారి వ్యాపారం సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కార్పొరేట్ ఆఫీస్ లో వర్క్ చేసేవాళ్లు ఎక్కువగా ఇంటి నుంచి భోజనాన్ని తెచ్చుకోవడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి రెడీమేడ్ ఫుడ్ అందుబాటులో ఉంచే ఫుడ్ సెంటర్ ను ఏర్పాటు చేయడం వల్ల విజయవంతం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫుడ్ క్వాలిటీ గా ఉంటే మిగతావారు కూడా ఇక్కడికే వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల కార్పొరేట్ ఆఫీస్ ఎదుట ఈ వ్యాపారం ప్రారంభించండి.