Bigg Boss 9 Telugu: నిన్న బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి ఫైర్ స్ట్రోమ్ లాగా హౌస్ మేట్స్ అడుగుపెట్టారు. ఒక్కొక్కరు మామూలు రేంజ్ లో లేరు, గత రెండు మూడు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ లో వచ్చిన వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ చాలా వైల్డ్ గా ఉండబోతున్నారు అని నిన్నటి ఎపిసోడ్ తో అర్థమైంది. అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, శ్రీజ ని వీళ్ళ ఓటింగ్ తో ఎలిమినేట్ చేయడం చాలా అన్యాయం అనిపించింది. బిగ్ బాస్ షో పై ఆడియన్స్ లో ఈ విషయం లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఆడియన్స్ ఓట్లకు విలువ ఇవ్వకుండా, మీకు ఇష్టమొచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేసుకునే దానికి, మమ్మల్ని ఓట్లు వేయమని అడగడం ఎందుకు?, ఆడియన్స్ ఓట్లకు విలువ లేదా?, ఇదెక్కడి న్యాయం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నిలదీస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే నిన్నటి వైల్డ్ కార్డ్స్ చాలా మందికి శ్రీనివాస్ సాయి గురించి తెలియదు. మిగిలిన కంటెస్టెంట్స్ సీరియల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యి ఉన్నారు కానీ, ఇతన్ని మాత్రం ఎక్కడా ఇంతకు ముందు చూసినట్టుగా మనకు అనిపించదు. కానీ ఇతను ఒక చైల్డ్ ఆర్టిస్ట్. అక్కినేని నాగార్జున హీరో గా నటించిన కేడి చిత్రం లో బాలనటుడిగా నటించాడు. ఆ తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం లో సుమంత్ హీరో గా తెరకెక్కిన ‘గోల్కొండ హై స్కూల్’ చిత్రం లోనూ నటించాడు. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన మళ్లీ నాగార్జున తో కలిసి ఊపిరి చిత్రం లో నటించాడు. ఇలా వరుసగా నాగార్జున తో, ఆయన కుటుంబ హీరోలతో కలిసి సినిమాలు చేయడం తో, నువ్వు అక్కినేని ఫ్యామిలీ కి సంబంధించిన వాడివా? అని ఆయన్ని అడిగే వారట. ఈ విషయం స్వయంగా నిన్న వేదికపై శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.
చూసేందుకు కుర్రాడు చాలా చలాకీగా ఉన్నాడు, గేమ్స్ కూడా బాగా ఆడుతాడని అనిపిస్తుంది. అయితే గతంలో ఈయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ‘గోల్కొండ హై స్కూల్’ చిత్రం షూటింగ్ సమయంలో తనకు ఎదురైన కొన్ని సంఘటనలు గురించి చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడుతూ ‘గోల్కొండ హై స్కూల్ మూవీ షూటింగ్ సమయంలో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు నాతో ఎండల్లో అనేక షాట్స్ చేయించేవాడు. అప్పుడు నాకు కోపం వచ్చేది. ఇంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళతో చేయించుకోవచ్చు కదా, నేనే దొరికానా?, ఎండల్లో చేయలేక చచ్చిపోతున్నాను అని అనేవాడిని. కానీ ఆ తర్వాతే తెలిసింది, ఆయన నా టాలెంట్ కి విలువ ఇచ్చి ఎక్కువ సన్నివేశాలు చేయించాడని’ అంటూ చెప్పుకొచ్చాడు శ్రీనివాస్ సాయి. ఇతను కరెక్ట్ గా గేమ్ ఆడుతూ ముందుకు దూసుకుపోతే కచ్చితంగా టాప్ 5 వరకు వెళ్లే అవకాశం ఉంటుంది, చూడాలి మరి.