Allu Arjun Bail : సంధ్య థియేటర్ తొక్కిసిలాట ఘటన లో A11 నిందితుడిగా నిల్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి నేడు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక పక్క ‘పుష్ప 2 ‘ చిత్రం నేటితో ‘బాహుబలి 2’ వసూళ్లను దాటడం, మరోపక్క అల్లు అర్జున్ కి బెయిల్ రావడం ఆయన అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. సాధారణంగా ఏ కేసు లో అయితే A1, A2 స్థాయి నిందితులకు బెయిల్ రావడం కష్టం గా ఉంటుంది. కానీ A11 నిందితుడికి బెయిల్ దొరకడం ఇంత కష్టంగా ఉంటుందా అని అల్లు అర్జున్ విషయంలోనే తెలిసింది. దీనిని బట్టి పోలీసులు ఆయన పై ఏ రేంజ్ ఫైర్ మోడ్ లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ రావడానికి ప్రధాన కారణం లాయర్ నిరంజన్ రెడ్డి.
ఆయన ఈ కేసు టేకప్ చేయకుండా ఉండుంటే, అల్లు అర్జున్ కి ఇంత తేలికగా బెయిల్ దొరికేది కాదని అంటున్నారు విశ్లేషకులు. మొత్తం మీద ఈ రెగ్యులర్ బెయిల్ ని రప్పించడానికి దాదాపుగా మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిలు ఖర్చు చేశారట. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ఆ డబ్బులతో చిన్న పాటి సినిమానే తీసేయొచ్చు అన్నమాట. మామూలుగా అయితే ఇంత ఖర్చు అవ్వదు. కానీ అల్లు అర్జున్ ని ఎలా అయినా జైలు కి పంపాల్సిందే, అతని బెయిల్ రద్దు అవ్వాల్సిందే అనే ధోరణిలో పోలీసులు ఉండడంతో, హై ప్రొఫైల్ లాయర్ ని పెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ఇంత ఖర్చు అయ్యింది. మధ్యంతర బెయిల్ కోసం కూడా చాలా ఖర్చు చెయ్యాల్సి వచ్చింది. ఒక్క రాత్రి కోసం దాదాపుగా 2 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యినట్టు టాక్. మొత్తం మీద ఈ వ్యవహారం లో అల్లు అర్జున్ టీం కి 5 కోట్ల రూపాయిల ఖర్చు అయ్యింది.
మొత్తానికి ఆయనకీ రెగ్యులర్ బెయిల్ రావడంతో ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్ కి సిద్ధం కాబోతున్నాడు. కేవలం ఆ సినిమా ఒక్కటే కాదు, మిగిలిన ప్రాజెక్ట్స్ కి సంబంధించిన స్టోరీలను కూడా వింటున్నాడు. ముందుగా ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం కోసం ఆయన సరికొత్త లుక్ ని మైంటైన్ చేయబోతున్నాడు. 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా వచ్చే నెల లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా గత రెండు రోజులుగా అల్లు అర్జున్ కొరటాల శివ తో స్టోరీ సిట్టింగ్స్ వేస్తున్నాడట. వీళ్ళ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా రానుంది. ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించి చాలా సంవత్సరాలు అయ్యింది. మధ్యలో కొరటాల ‘ఆచార్య’ ,’దేవర’ చిత్రాలకు కమిట్ అవ్వడం తో ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యింది.