Rohith Sharma : టెస్ట్ జట్టుకు బుమ్రా కొనసాగుతాడా? లేకుంటే రోహిత్ శర్మను మళ్లీ జట్టులోకి తీసుకుంటారా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.. ఇక వన్డే జట్టుకు కూడా కొత్త సారధిని బీసీసీఐ నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వన్డే జట్టుకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటిస్తుంది. ఆ జట్టుతో వన్డే సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది.. ఈ సిరీస్ ముగిసిన తర్వాత పాకిస్తాన్ వెహికల్గా జరిగే ఐసిసి ఛాంపియన్ ట్రోఫీకి కూడా హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తాడని సమాచారం. అయితే వన్డే జట్టుకు రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయడం పట్ల రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
క్రికెట్ కు గుడ్ బై చెప్పక తప్పదా..
టెస్ట్ జట్టు నుంచి ఇప్పటికే రోహిత్ శర్మ దూరం జరిగాడు. అతడు దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలోనే రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశారని వార్తలు వస్తున్నాయి.. అయితే రోహిత్ శర్మ టెస్ట్ జట్టుకు మాత్రమే కాకుండా.. వన్డే జట్టుకు కూడా దూరం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ వన్డే జట్టుకు కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అయితే.. అప్పుడు రోహిత్ శర్మ సాధారణ ఆటగాడిగా ఉంటాడా.. లేక క్రికెట్ కు శాశ్వత వీడ్కోలు పలుకుతాడు తెలియాల్సి ఉంది. ఇప్పటికే రోహిత్ శర్మ టి20 నుంచి శాశ్వతంగా తప్పుకున్నాడు. ఇటీవల టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇప్పటికే t20 జుట్టుకు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. అతని ఆధ్వర్యంలో టీమిండియా వరుసగా టోర్నీలను గెలుచుకుంది.. టెస్టుల్లో రోహిత్ శర్మ అంతగా ఫామ్ లో లేడు కాబట్టి.. అతడిని జట్టు నుంచి తప్పించారు. వన్డేలలో అతడు అదరగొడుతున్నాడు. అలాంటప్పుడు వన్డే జట్టు నుంచి అతడిని ఎలా తప్పిస్తారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.. రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోకి వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇక ఇటీవల రోహిత్ ఆధ్వర్యంలో శ్రీలంక పై జరిగిన వన్డే సిరీస్ లో టీం ఇండియా రెండు మ్యాచ్లను కోల్పోయి.. సిరీస్ దూరం చేసుకుంది.