Devara: ‘దేవర’ లో వచ్చే ఈ ఫైట్ సన్నివేశం హిస్టరీ లో నిలిచిపోతుంది..కొరటాల ప్లానింగ్ మామూలుగా లేదుగా!

రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి డివైడ్ టాక్ రావడంతో ఈ చిత్రం పై అంచనాలు తగ్గాయి అనేది కొందరి వాదన. అయితే ఆ థియేట్రికల్ ట్రైలర్ లో కొన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే కొరటాల శివ యాక్షన్ సన్నివేశాలను ఈ చిత్రం లో ఎంత అద్భుతంగా రాసుకున్నాడో అర్థం అవుతుంది.

Written By: Vicky, Updated On : September 13, 2024 8:55 pm

Devara

Follow us on

Devara: ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ మూవీ ప్రొమోషన్స్ లో ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. తెలుగు తో పాటు హిందీ కి సంబంధించిన అనేక ఇంటర్వ్యూస్ ని షూట్ చేస్తుంది మూవీ టీం. ఇప్పటికే డైరెక్టర్ సందీప్ వంగ తో ఒక ఇంటర్వ్యూ చేసారు. ఇప్పుడు రీసెంట్ గా సిద్దు జొన్నలగడ్డ మరియు విశ్వక్ సేన్ తో కలిసి ఎన్టీఆర్, కొరటాల శివ ఒక ఇంటర్వ్యూ షూట్ చేసారు. త్వరలోనే ఈ ఇంటర్వ్యూ యూట్యూబ్ లో అప్లోడ్ కానుంది. ఈ నెల 27 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ రీసెంట్ గా విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్ కి ఫ్యాన్స్ నుండి డివైడ్ టాక్ రావడంతో ఈ చిత్రం పై అంచనాలు తగ్గాయి అనేది కొందరి వాదన. అయితే ఆ థియేట్రికల్ ట్రైలర్ లో కొన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే కొరటాల శివ యాక్షన్ సన్నివేశాలను ఈ చిత్రం లో ఎంత అద్భుతంగా రాసుకున్నాడో అర్థం అవుతుంది.

ఒక సన్నివేశం లో ఎన్టీఆర్ మరియు సైఫ్ అలీ ఖాన్ తలపడుతారు. ఈ ఫైట్ సన్నివేశాన్ని చాలా కొత్తగా ఉండేలా డిజైన్ చేసాడు డైరెక్ట్ కొరటాల శివ. ఈ ఫైట్ సన్నివేశం లో ఎన్టీఆర్ – సైఫ్ అలీ ఖాన్ ఒకరి చెయ్యిని ఒకరు వదులుకోరు. సాయంత్రం అనగా ఈ పోరాటం మొదలైతే, తెల్లవారు జాము వరకు కొనసాగుతూనే ఉంటుంది. అలా ఈ ఇద్దరు ఒకరి చేయి ఒక్కరు పట్టుకొనే ఫైట్ చేసుకుంటారట. ఇలాంటి సన్నివేశాన్ని తీయాలనే ఆలోచన ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ కి కూడా రాలేదు. ఈ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలబడనుంది అట, ఆ స్థాయిలో డైరెక్టర్ కొరటాల శివ తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. కేవలం ఇదొక్కటే కాదు, ఇలాంటి సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయట. ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా యాక్షన్ మూవీ లవర్స్ అందరికీ ఈ సన్నివేశాలు ఒక విజువల్ ఫీస్ట్ లాగా ఉండబోతుందని తెలుస్తుంది. సెన్సార్ సభ్యులు కూడా ఈ సన్నివేశాల గురించి ప్రత్యేకించి మాట్లాడారట.

ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశానికి థియేటర్స్ లో ఉండే ఆడియన్స్ ఫ్యూజులు ఎగిరిపోయేలా డిజైన్ చేసాడట కొరటాల. ట్రైలర్ ని చూసి సినిమాని అంచనా వెయ్యొద్దని, దేవర చిత్రం కేవలం ఎన్టీఆర్ కెరీర్ లో మాత్రమే కాదు, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే బెస్ట్ యాక్షన్ మూవీ గా నిలిచిపోతుందని, అభిమానులు గర్వంగా చెప్పుకునేలా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి చెప్పిన విధంగానే సినిమా ఉంటుందా లేదా అనేది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకల ఏర్పాట్లు మొదలయ్యాయి అట. అభిమానులు చిరకాలం గుర్తించుకునేలా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారట మేకర్స్, ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులు కూడా ఉంటారని సమాచారం.