Heroine : ఈ క్యూట్ స్కూల్ స్టూడెంట్ ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్న హాట్ హీరోయిన్! ఎవరో చెప్పుకోండి చూద్దాం!

Heroine దర్శకుడు పూరి జగన్నాథ్ ఈమెకు హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చాడు. హీరో వరుణ్ తేజ్ కి జంటగా లోఫర్ సినిమాలో నటించింది.

Written By: NARESH, Updated On : June 13, 2024 10:34 pm

Disha Patani

Follow us on

Heroine : క్రేజీ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ స్కూల్ డేస్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోలో ఇన్నోసెంట్ గా కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? సౌత్ టు నార్త్ ఈ బ్యూటీ కి డిమాండ్ మామూలుగా లేదు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది. స్టార్ డమ్ వచ్చింది హిందీ సినిమాలతో అయినా హీరోయిన్ గా పరిచయం అయింది మాత్రం తెలుగు చిత్రంతోనే.

దర్శకుడు పూరి జగన్నాథ్ ఈమెకు హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చాడు. హీరో వరుణ్ తేజ్ కి జంటగా లోఫర్ సినిమాలో నటించింది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈ టాలెంటెడ్ బ్యూటీ పేరు దిశా పటాని. లక్నోలోని అమిటీ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా 2013లో రన్నర్ అప్ గా నిలిచింది. మోడలింగ్ రంగం నుంచి నటిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. 2015 లో విడుదలైన లోఫర్ సినిమాతో తెరంగేట్రం చేసింది.

టైగర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అదే ఏడాది ఎం ఎస్ ధోనీ ది అన్ టోల్డ్ స్టోరీ లో ధోని మొదటి ప్రేయసి గా నటించింది. ఈ సినిమాతో ఆమె దశ తిరిగింది. వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు వచ్చాయి. బాఘీ 2, మలాంగ్, ఏక్ విలన్ రిటర్న్స్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ డమ్ అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడీ లో కీలక పాత్రలో నటిస్తుంది.

హీరోయిన్ గా దిశా పటాని బాగానే వెనకేసింది. ఇప్పటివరకు ఆమె రూ. 75 కోట్లు సంపాదించినట్లు తెలుస్తుంది. ఒక్కో సినిమాకు రూ. 6 కోట్లు తీసుకుంటుందట. ఇక బ్రాండ్ ప్రమోషన్స్ కోసం రెండు కోట్లు తీసుకుంటుందట. క్వాలిన్ క్లీన్ బ్రాండ్ అంబాసిడర్ గా నెలకు రూ. 10 లక్షలు తీసుకుంటుందట. బాంద్రాలో 5 కోట్ల విలువైన లగ్జరీ హౌస్ కొనుగోలు చేసింది. అలాగే రూ. 1. 51 కోట్ల ల్యాండ్ రోవర్. రేంజ్ రోవర్ స్పోర్ట్స్ తో సహా కొన్ని లగ్జరీ కార్లు బ్యూటీ వద్ద ఉన్నాయి. నెలకు దిశా పటాని సంపాదన కోటి రూపాయల పైనే అంటున్నారు.