Mahesh Babu : సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తను చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా తెచ్చుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఆయన డిఫరెంట్ పాత్రలనైతే ఎంచుకుంటున్నాడు.
ఇక ఇప్పుడు రాజమౌళి తో కలిసి పాన్ వరల్డ్ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆయన ఆ సినిమాకు సంబంధించిన మేకవర్లో బిజీగా ఉన్నాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు చిన్నతనంలో ఉన్నప్పుడు కొన్ని సినిమాలను 100 కంటే ఎక్కువ సార్లు చూశాడట. ఇక ఆ సినిమాలు ఏంటి అంటే మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, సింహాసనం ఈ మూడు సినిమాలను వంద కంటే ఎక్కువ సార్లు చూశారట. ఇక ఈ మూడు సినిమాల్లో కూడా కృష్ణనే హీరో కావడం విశేషం…
ఇక మహేష్ బాబుకు చిన్నప్పటి నుంచి కృష్ణ నటన అంటే చాలా ఇష్టం..అందుకే మహేష్ బాబు ఫేవరెట్ యాక్టర్ కూడా కృష్ణ గారే కావడం విశేషము. ఇక మొత్తానికైతే మహేష్ బాబు తన ఎంటైర్ కెరియర్ లో ఎక్కువసార్లు చూసిన సినిమాలు కూడా ఈ మూడు సినిమాలే కావడం విశేషం.. అయితే కృష్ణ గారి సినిమాలే కాకుండా ఆయనకు బాగా నచ్చిన సినిమాలు ఏంటంటే చిరంజీవి హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్, జగదేకవీరుడు అతిలోకసుందరి, ఖైదీ సినిమాలు అంటే ఆయనకు చాలా ఇష్టమట.
ఇక ఈ సినిమాలను కూడా దాదాపు ఒక 20 సార్లు చూసాడని కొన్ని సందర్భాల్లో తెలియజేశాడు. ఇక మొత్తానికైతే మహేష్ బాబు ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ గా మంచి గుర్తింపును పొందుతున్నాడు…ఇక దానికి తోడుగా ఆయన ఇప్పుడు పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు…చూడాలి మరి ఆయన ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు అనేది…