Homeఎంటర్టైన్మెంట్Hrithik Roshan: టాలీవుడ్ ఫ్లాప్ డైరెక్టర్స్ తో హృతిక్ రోషన్.. పాపం గట్టిగానే టార్గెట్ చేశారుగా...

Hrithik Roshan: టాలీవుడ్ ఫ్లాప్ డైరెక్టర్స్ తో హృతిక్ రోషన్.. పాపం గట్టిగానే టార్గెట్ చేశారుగా !

Hrithik Roshan: ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు హృతిక్ రోషన్. ఒకప్పుడు ఈయనకు సౌత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ , క్రేజ్ మామూలుది కాదు. బాలీవుడ్ హీరోలను మన తెలుగు ఆడియన్స్ అంత తేలికగా ఇష్టపడరు , ఒకవేళ ఇష్టపడిన థియేటర్స్ కి వెళ్లేంత మూడ్ వాళ్లకు ఉండేది కాదు , అలాంటి తెలుగు ఆడియన్స్ ని కూడా థియేటర్స్ కి ఎగబడేలా చేసిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆయన. హృతిక్ రోషన్ నటించిన క్రిష్, ధూమ్ 2, క్రిష్ 2 వంటి చిత్రాలు ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపాయి. అయితే హృతిక్ రోషన్ అదే రేంజ్ ఊపుని కొనసాగించడం లో విఫలం అయ్యారు. తన రేంజ్ కి తగ్గ సినిమాలు చేయలేదు. అంతే కాకుండా సినిమా సినిమాకు ఆయన భారీ గ్యాప్ ఇచ్చేవారు.

ఆ కారణం చేత ఆయన సౌత్ ఆడియన్స్ కి బాగా దూరం అయ్యారు. ‘వార్ 2’ తో మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేశారు కానీ , అది సాధ్యం అవ్వలేదు. అయితే ఇప్పుడు ఆయన సౌత్ మార్కెట్ ని కొల్లగొట్టేందుకు సౌత్ డైరెక్టర్స్ తో , ప్రత్యేకించి తెలుగు డైరెక్టర్స్ తో సినిమాలు ఒప్పుకుంటున్నారు. రీసెంట్ గానే ఆయన ‘హోమబుల్ ఫిలిమ్స్’ సంస్థ లో ఒక సినిమా చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సిరీస్ , సలార్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ ని తెరకెక్కించిన కంపెనీ, కచ్చితంగా హృతిక్ రోషన్ తో ఆ రేంజ్ స్కేల్ ఉన్న సినిమాని , ఒక టాప్ సౌత్ ఇండియన్ డైరెక్టర్ తో చేస్తారేమో అని అంతా ఊహించారు. కానీ అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ , ఒక డిజాస్టర్ డైరెక్టర్ తో ఆయన ఈ బ్యానర్ లో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు.

ఆ డైరెక్టర్ మరెవరో కాదు పరశురామ్ పెట్ల. ‘ఫ్యామిలీ స్టార్’ వంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత , ఈ డైరెక్టర్ చాప్టర్ క్లోజ్ అయ్యిందని అంతా అనుకున్నారు. కానీ క్లోజ్ అవ్వలేదు, ఏకంగా హృతిక్ రోషన్ తో సినిమా చేసే రేంజ్ కి వెళ్లిపోయారు. ఈ కాంబినేషన్ ని చూసి ‘అన్నం లోకి ఐస్ క్రీం కలుపుకొని తిన్నట్టు , ఇదేమి కాంబినేషన్ రా బాబోయ్’ అంటూ నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. కేవలం పరుశరామ్ పెట్ల మాత్రమే కాదు , టాలీవుడ్ లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను తీసి, కెరీర్ లో ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న మరో ముగ్గురు టాలీవుడ్ డైరెక్టర్స్ కూడా రీసెంట్ గానే హృతిక్ రోషన్ ని కలిసి స్టోరీలు వినిపించారట. ఇది చూసిన ఆయన అభిమానులు , అసలు మా హీరోకి ఏమైంది?, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...

Haripriya Vasishta N Simha: ఈ భార్యభర్తలిద్దరూ ప్రముఖ నటులే.. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు..

Haripriya Vasishta N Simha: సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఇందులో ఒక్కసారి ఛాన్స్ వస్తే ఎవరు వదులుకోరు. ఒక కుటుంబంలో ఒకరికి అవకాశం వస్తే ఆ తర్వాత వారికి సంబంధించిన వారు...
Oktelugu Epaper
Exit mobile version