Tollywood: ప్రస్తుత మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఒక ఇంటర్వ్యూలో చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాల గురించి, ఆర్థిక సమస్యల గురించి చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూలో హీరోయిన్ చిన్నప్పుడు తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు అని దాంతో నీళ్లు తాగే బ్రతికే వాళ్ళమని రోజుకు తమ దగ్గర కేవలం ఎనిమిది రూపాయలు మాత్రమే ఉండేవని చిన్నప్పుడు తను ఎదుర్కొన్న కష్టాల గురించి తెలిపింది. కానీ ప్రస్తుతం ఈ హీరోయిన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ హీరోయిన్. కెరియర్ ప్రారంభంలో బుల్లితెర మీద పలు సీరియల్స్ లో నటించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ టెలివిజన్లో ప్రచారం అయ్యే కిట్టి పార్టీ అనే ఒక సీరియల్ లో 2002లో తన కెరియర్ ప్రారంభించింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో సహాయక పాత్రలలో కూడా కనిపించి అలరించింది. ఆ సమయంలోనే ఈమెకు ఏక్తా కపూర్ తెరకెక్కించిన ఒక సినిమాలో ప్రధాన పాత్రలో నటించే అవకాశం వచ్చింది. అలా సినిమాలలో తన కెరీర్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ అతి తక్కువ సమయంలోనే హిందీలో పలు స్టార్స్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. కార్తీక్ ఆర్యన్ నటించిన ప్యార్ క పంచనామా సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించి నటిగా ప్రశంసలు కూడా అందుకుంది. ప్యార్ క పంచనామా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయం అందుకుంది.
ఈమె నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టాయి. ఈ హీరోయిన్ నటించిన డ్రీమ్ గర్ల్ సినిమా 2019లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 200 కోట్లు కలెక్షన్లు రాబట్టి ఆ ఏడాది అత్యధిక వసూలు సాధించిన సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ హీరోయిన్ మరెవరో కాదు నుష్రత్ భరుచా. నుష్రత్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబంలో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పుకొచ్చింది. తన కుటుంబంలో తను మాత్రమే సంపాదించేదని తెలిపింది. చదువుకుంటున్న రోజుల్లో తాను ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నట్లు కూడా చెప్పుకొచ్చింది. ప్రతిరోజు కేవలం 8 రూపాయలు మాత్రమే ఉండేవని నీళ్లు తాగి బతికానని తెలిపింది. కెరియర్ ప్రారంభంలో ఒక నెలలో ఎంత ఖర్చు చేయాలో కూడా తాను ముందుగానే నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.
తన ముఖ్యమైన అవసరాలన్నీ తీరిన తర్వాత వేరేది కొనుగోలు చేయడం లేదా డబ్బులను పొదుపు చేయడం వంటివి చేసినట్లు తెలిపింది. మిగిలిన డబ్బులను ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి వినియోగిస్తాను అని చెప్పుకొచ్చింది. తన తండ్రి వ్యాపారంలో మోసపోయిన తర్వాత తన ప్రపంచాన్ని మార్చుకున్నట్లు ఈ హీరోయిన్ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాను ఎన్నో ఆర్థిక ఇబ్బందులను చూడడంతో డబ్బులను ఖర్చు చేయడంలో ఇప్పటికీ కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. తను కాలేజీ చదువుతున్న సమయంలో ఐదు సంవత్సరాలలో కేవలం 100 రూపాయలు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపింది. అది కూడా ప్రతిరోజు కేవలం ఎనిమిది రూపాయలు ప్రయాణం కోసం మాత్రమే ఖర్చు చేసేదట. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
View this post on Instagram