Salaar: సలార్’ గురించి ఎవరికీ తెలియని విషయాలు

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు అంతా ఎంతో ఆసక్తిగా సలార్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయన్న సంగతి తెలిసిందే.

Written By: Suresh, Updated On : December 21, 2023 3:11 pm

Salaar

Follow us on

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న చిత్రం ‘సలార్’. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ రేపు ( డిసెంబర్ 22)న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది.

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు అంతా ఎంతో ఆసక్తిగా సలార్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయన్న సంగతి తెలిసిందే. అయితే సలార్ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు తాజాగా బయటకు వచ్చాయి. అవి ఏంటో మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రభాస్ హీరోగా భారీ అంచనాలతో వస్తున్న సలార్ చిత్ర కథ ఇప్పటిది కాదట. సుమారు 15 సంవత్సరాల క్రితమే దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ కథను సిద్ధం చేసుకున్నారని తెలస్తోంది. అయితే డైరెక్టర్ గా తొలి ప్రయత్నంలోనే ఇంత పెద్ద కథను చెప్పడంతో పాటు నిర్మాణంలోనూ బడ్జెట్ పరంగా సమస్యలు వచ్చే అవకాశం ఉందని భావించారు. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు తీసిన తరువాత సలార్ ను తీయాలని భావించారట. ఇందుకు గానూ సుమారు 15 ఏళ్లు పట్టిందని ప్రశాంత్ నీల్ తెలిపారని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ‘ఉగ్రం’. అయితే యశ్ కథనాయకుడిగా వచ్చిన కేజీయఫ్ చిత్రాలు భారీ విజయాన్ని అందించడంతో ఆయన దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారని చెప్పొచ్చు.
దీంతో సలార్ మూవీపై అంతకన్నా భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు, ప్రేక్షకులు.

సలార్ మూవీలో దేవ పాత్రకు ప్రభాసే సరైన న్యాయం చేయగలరని ఆయనను ఎంపిక చేశారని సమాచారం. ఈ సినిమాలో శృతిహాసన్ కథనాయకగా నటించగా దేవకు సమానమైన మరో పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ నటించారు. ఓ సందర్భంగా ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ పృథ్వీరాజ్ లేకపోతే సలార్ సినిమానే లేదని చెప్పడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన పాత్ర ఎలా ఉంటుందనే విషయాన్ని. అలాగే ఈశ్వరి రావు, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.

ఇద్దరు ప్రాణ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు? అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.