Homeఎంటర్టైన్మెంట్Bhole: పల్లవి ప్రశాంత్ జైలు పాలు అయ్యాక ఎవ్వరూ చేయలేని పని చేసిన భోలే షావలి.....

Bhole: పల్లవి ప్రశాంత్ జైలు పాలు అయ్యాక ఎవ్వరూ చేయలేని పని చేసిన భోలే షావలి.. శభాష్..!

Bhole: పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. టైటిల్ గెలిచి వారం కూడా గడవక ముందే జైలు పాలయ్యాడు. బుధవారం రాత్రి పల్లవి ప్రశాంత్, అతని తమ్ముడిని స్వగ్రామంలో అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. మేజిస్ట్రేట్ పల్లవి ప్రశాంత్ కి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. కాగా అంతకు ముందు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పల్లవి ప్రశాంత్ ఉన్నాడని తెలిసి… భోలే షావలి అక్కడకు వచ్చాడు.

పల్లవి ప్రశాంత్ యోగక్షేమాలు పోలీసులను అడిగి తెలుసుకున్నాడు. అనంతరం మీడియాతో మాట్లాడాడు. పల్లవి ప్రశాంత్ ఒక రైతుబిడ్డగా హౌస్లో అడుగుపెట్టి విజయం సాధించాడు. బిగ్ బాస్ ప్రమాదకరమైన గేమ్. నేను పాట మాత్రమే పాడాను. పల్లవి ప్రశాంత్ ఆట ఆడాడు. ఒకసారి ఛాతి మీద దెబ్బ తగిలితే నాకు ఏమన్నా అవుతుందా అన్నా అని అడిగాడు.

Also Read: డంకి మూవీ ఫుల్ రివ్యూ

పల్లవి ప్రశాంత్ కి ఏమీ తెలియదు. అతడు లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేస్తున్నాడని కూడా అవగాహన లేదు. తన కోసం ఫ్యాన్స్ వచ్చారు అనే ఆనందంలో అలా చేశాడు. అత్యుత్సాహంతో జరిగిన పొరపాట్లు తప్పితే కావాలని చేసింది కాదు. అందరూ పల్లవి ప్రశాంత్ బయటకు రావాలని కోరుకోండి. సీఎం రేవంత్ రెడ్డి వరకు వెళ్ళాలి, అన్నారు. పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడే క్రమంలో ఆయన కళ్ళు చెమర్చాయి.

పల్లవి ప్రశాంత్ కోసం దండం పెట్టి వేడుకున్నాడు. పల్లవి ప్రశాంత్ ని బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. లాయర్లు ప్రయత్నం చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాడు. డిసెంబర్ 17 ఫైనల్ కాగా పల్లవి ప్రశాంత్ ని కలిసేందుకు భారీగా అభిమానులు వచ్చారు. ఈ క్రమంలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసుల ఆంక్షలు పట్టించుకోకుండా ర్యాలీ చేసిన పల్లవి ప్రశాంత్ పై పలు సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు.

Bhole Shavali crying about Pallavi Prashant Police case issues |Bigg Boss Pallavi Prashanth arrest

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....

Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత: కడవరకు తెలంగాణ వాదిగానే.. తెలంగాణ వచ్చినంకనే పెండ్లి..

Peddi Sudarshan Reddy: ఆయనకు తెలంగాణ అంటే ఇష్టం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండడం మరింత ఇష్టం.. అందువల్లే ఉద్యమాన్ని భుజాలకు ఎత్తుకున్నారు. పోరాటాల గడ్డ వరంగల్ జిల్లాలో గులాబీ జెండాను నెత్తిన...

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....

Rain forecast for AP: హమ్మయ్య.. ఏపీకి వర్ష సూచన!

Rain forecast for AP: ఏపీకి చల్లటి కబురు వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అది అల్పపీడనంగా మారి బలపడుతోంది. ఈరోజు ఉత్తరాంధ్రలో పిడుగులతో...
Oktelugu Epaper
Exit mobile version