https://oktelugu.com/

తిమ్మరుసు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ !

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్‌ హీరోగా వచ్చిన సినిమా ‘తిమ్మరుసు’. ఎవరేజ్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించ లేకపోయిన ఈ సినిమా రిలీజ్ అయి, వారం రోజులు అవుతుంది. మరి కలెక్షన్స్ చాలా ఏరియాల్లో ఇంకా స్టడీగా ఉన్నాయా ? లేక డిజాస్టర్ కి పడిపోయాయా ? చూద్దాం. నైజాం – 0.65 కోట్లు, సీడెడ్ – 0.21 కోట్లు, గుంటూరు – 0.11 కోట్లు, […]

Written By:
  • admin
  • , Updated On : August 7, 2021 / 10:09 AM IST
    Follow us on

    డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ తో శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్‌ హీరోగా వచ్చిన సినిమా ‘తిమ్మరుసు’. ఎవరేజ్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించ లేకపోయిన ఈ సినిమా రిలీజ్ అయి, వారం రోజులు అవుతుంది. మరి కలెక్షన్స్ చాలా ఏరియాల్లో ఇంకా స్టడీగా ఉన్నాయా ? లేక డిజాస్టర్ కి పడిపోయాయా ? చూద్దాం.

    నైజాం – 0.65 కోట్లు,

    సీడెడ్ – 0.21 కోట్లు,

    గుంటూరు – 0.11 కోట్లు,

    తూర్పు గోదావరి – 0.16 కోట్లు,

    పశ్చిమ గోదావరి – 0.09 కోట్లు,

    కృష్ణా – 0.14 కోట్లు,

    నెల్లూరు – 0.07 కోట్లు

    ఉత్తరాంధ్ర – 0.27 కోట్లు ,

    తెలంగాణ & ఏపీలో తిమ్మరుసు ఫస్ట్ వీక్ కలెక్షన్ల షేర్ : రూ. 1.70 కోట్లు,

    ఇక ‘రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ‘ఓవర్సీస్’ కలెక్షన్స్ విషయానికి వస్తే..

    రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ : 0.13 కోట్లు,

    వరల్డ్ వైడ్‌ గా చూసుకుంటే ‘తిమ్మరుసు’ 1.83 కోట్లు కలెక్ట్ చేసింది. కాకపోతే, సత్యదేవ్‌ మార్కెట్ కి మించి ‘తిమ్మరుసు’ సినిమాను రూ.2.4 కోట్లకు అమ్మారు. కాబట్టి ఈ సినిమా విజయం సాధించాలంటే.. కనీసం 3 కోట్ల వరకు వసూలు చేయాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏ సినిమా పోటీ లేని సమయంలోనే ఈ సినిమా వారం రోజులకు గానూ కేవలం రూ.1.83కోట్ల షేర్ ను రాబట్టింది.

    ఇక ఈ వారం 6 కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ పోటీలో “తిమ్మరుసు” నిలబడి వసూళ్లు చేయడం అంటే దాదాపు అసాధ్యమే. అయితే, ఇప్పటికే నైజాంలో తిమ్మరుసు బ్రేక్ ఈవెన్ అయింది. సత్యదేవ్ కి ఇది కాస్త ఊరట కలిగించే అంశం. మొత్తమ్మీద బాక్సాఫీస్ వద్ద కూడా ‘తిమ్మరుసు’ ఏవరేజ్ గానే నిలిచాడు.