తల్లిదండ్రులకు శుభవార్త.. పిల్లలకు కరోనా సోకినా అలా జరగదట!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గినా పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పెద్దలతో పోలిస్తే పిల్లలపై కరోనా ప్రభావం తక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. కొంతమంది పిల్లల్లో మాత్రమే దీర్ఘకాల కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. లండన్లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు ప్రతి 20 మంది పిల్లలలో ఒకరి కంటే తక్కువమందిలో చాలాకాలం పాటు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. లాన్సెట్ చైల్డ్, కౌమార ఆరోగ్యం జర్నల్ లో […]

Written By: Navya, Updated On : August 7, 2021 10:12 am
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గినా పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. పెద్దలతో పోలిస్తే పిల్లలపై కరోనా ప్రభావం తక్కువగా ఉందనే సంగతి తెలిసిందే. కొంతమంది పిల్లల్లో మాత్రమే దీర్ఘకాల కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. లండన్లోని కింగ్స్ కాలేజీ పరిశోధకులు ప్రతి 20 మంది పిల్లలలో ఒకరి కంటే తక్కువమందిలో చాలాకాలం పాటు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

లాన్సెట్ చైల్డ్, కౌమార ఆరోగ్యం జర్నల్ లో వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా సోకిన పిల్లల్లో కేవలం 4.4 శాతం మందిలో మాత్రమే నెలరోజుల కంటే ఎక్కువ కాలం లక్షణాలు కనిపించాయి. పిల్లల్లో లాంగ్ కోవిడ్ కేసులు తక్కువగా ఉంటాయని కరోనా ఇన్ఫెక్షన్ తర్వాత పిల్లల్లో మూర్ఛ, మెదడు సమస్యలు కనిపించవని పిల్లల్లో లాంగ్ కోవిడ్ కేసులు కనిపించవని చెప్పడానికి ఇదే సాక్ష్యమని ప్రొఫెసర్ ఎమ్మా డంకన్ చెప్పుకొచ్చారు.

తల్లిదండ్రులు, పిల్లల సంరక్షకుల కోసం ఉపయోగించే జో యాప్ సహాయంతో శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. రెండున్నర లక్షల మంది పిల్లల డేటాను పరిశీలించి 7 వేల మంది పిల్లలు కరోనా బారిన పడినట్టు గుర్తించామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 4 వారాల పాటు కరోనా లక్షణాలను చూపించిన పిల్లలు తక్కువ సంఖ్యలో ఉన్నారని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం.

కరోనా సోకినప్పటికీ చాలామంది పిల్లల్లో అస్సలు లక్షణాలు కనిపించడం లేదు. కరోనా పాజిటివ్ వచ్చిన కొంతమంది పిల్లలు మాత్రం తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నారని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.