Tollywood Directors: స్టార్ హీరో లకు హిట్లు ఇచ్చిన ఈ డైరెక్టర్లు, యంగ్ హీరో లకు హిట్లు ఇవ్వడం లో మాత్రం ఫెయిల్ అయ్యరా..?

Tollywood Directors చిరంజీవితో దాదాపు 20 కి పైన సినిమాలు చేసి అన్ని సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి మెగాస్టార్ అవడానికి ఈయన సినిమాలే ముఖ్య పాత్ర వహించాయి.

Written By: Gopi, Updated On : February 14, 2024 11:35 am
Follow us on

Tollywood Directors: కొంతమంది దర్శకులు స్టార్ హీరోలకు భారీ సక్సెస్ లను అందిస్తూ వాళ్లు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు గా ఎదుగుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ ను సాధించడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే యంగ్ హీరోలతో సినిమాలు చేసినప్పుడు మాత్రం వాళ్ళు తడబడుతూ ఉంటారు. అలాంటి డైరెక్టర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కోదండరామిరెడ్డి
ఈయన చిరంజీవితో దాదాపు 20 కి పైన సినిమాలు చేసి అన్ని సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి మెగాస్టార్ అవడానికి ఈయన సినిమాలే ముఖ్య పాత్ర వహించాయి. కానీ యంగ్ హీరోలైన తారక రత్న తో ఒకటో నెంబర్ కుర్రాడు, కోదండ రామిరెడ్డి కొడుకు అయిన వైభవ్ తో చేసిన గొడవ సినిమాలు ప్లాప్ అయ్యాయి…

బి గోపాల్
చిరంజీవి, వెంకటేష్ ,బాలకృష్ణ లాంటి హీరోలకి భారీ సక్సెస్ లను అందించిన బి గోపాల్ ప్రస్తుతం యంగ్ హీరోలకి సక్సెస్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు. ముఖ్యంగా ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి హీరోలతో సినిమాలు చేసిన కూడా వీళ్ళ ఎవరికీ ఒక్క సక్సెస్ ని కూడా ఇవ్వలేకపోయాడు…

సురేష్ కృష్ణ
సురేష్ కృష్ణ రజనీకాంత్ తో భాష లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్టుని తీసిన తర్వాత చిరంజీవి తో మాస్టర్ సినిమా తీసి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వెంకటేష్ తో ప్రేమ, ధర్మచక్రం లాంటి సినిమాలు చేసి భారీ సక్సెస్ లను అందుకున్నాడు. కానీ ప్రభాస్, తారకరత్న లాంటి హీరోలకు మాత్రం సక్సెస్ ని అందించలేకపోయాడు.

ఇలా చాలామంది స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరోలకు సక్సెస్ లు ఇచ్చి, యంగ్ హీరోలకు మాత్రం ఫెయిల్యూర్ ఇచ్చారు. అందుకే ఇప్పుడు మరే హీరో కూడా వీళ్ళతో సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు. ఇక దాంతో ఆల్మోస్ట్ వీళ్ళ కెరియర్లు ముగిసిపోయాయనే చెప్పాలి…