Nara Lokesh: పవన్ కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న లోకేష్.. వైరల్

ఏపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి అతిరథ మహారధులు తరలివచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో పాటు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సైతం తరలి వచ్చారు.

Written By: Dharma, Updated On : June 13, 2024 3:42 pm

Nara Lokesh

Follow us on

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎన్నెన్నో అద్భుతాలు ఆవిష్కృతం అయ్యాయి. అనుబంధాలు తెరపైకి వచ్చాయి. వేదికపైకి వచ్చిన నారా భువనేశ్వరి నుదుటిపై ముద్దు పెట్టిన బాలకృష్ణ తన ఆత్మీయతను చాటుకున్నారు. తన సోదరి పడిన బాధలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు తర్వాత ప్రమాణస్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ, సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ ఇద్దరు వద్దని వారించారు. మరోవైపు లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తండ్రి చంద్రబాబు, మామయ్య బాలకృష్ణ లకు పాదాభివందనం చేశారు. ప్రధాని మోదీ, మంత్రి అమిత్ షాకు సైతం పాదాభివందనం చేయడానికి ప్రయత్నించగా వారు ఒప్పుకోలేదు.

అయితే వీరందరికీ కాదని లోకేష్ పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. పవన్ వద్దని వారించినా.. సోదర సమానులైన వ్యక్తి ఆశీర్వాదం తీసుకోవడంలో తప్పు లేదంటూ ఆయన పాదాలను తాకారు లోకేష్. దీనికి సంబంధించిన వీడియోను జన సైనికులు, టిడిపి ఫాలోవర్లు షేర్ చేస్తున్నారు. ఇది చూశాక లోకేష్ పై మరింత అభిమానం పెరిగిందని.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయన స్పెషాలిటీ అని డిటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఏపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి అతిరథ మహారధులు తరలివచ్చారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవితో పాటు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు సైతం తరలి వచ్చారు. అయితే ఎంతమంది ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిలిచారు. తన ప్రత్యేకతను చాటుకున్నారు. కార్యక్రమం చివరిలో మెగాస్టార్, పవర్ స్టార్ తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభివాదం చేయడం, ఆత్మీయంగా హత్తుకోవడం గమనార్హం. అయితే అన్నింటికీ మించి లోకేష్ పవన్ కు పాదాభివందనం చేయడం మాత్రం వైరల్ అంశంగా మారిపోయింది.