https://oktelugu.com/

Bigg Boss Host: బిగ్ బాస్ హోస్ట్: నాగార్జున కాదంటే ఆ దమ్మున్న స్టార్స్ వీరే!

Bigg Boss Host: నాగార్జున హోస్ట్ చేసిన సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక్క సీజన్ 6 మాత్రం విఫలం కాగా, నాగార్జున విమర్శలు ఎదుర్కొన్నాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 13, 2024 / 04:42 PM IST

    Bigg Boss Host

    Follow us on

    Bigg Boss Host: కింగ్ నాగార్జున గత ఐదు సీజన్లుగా బిగ్ బాస్ షోకి సక్సెస్ ఫుల్ గా హోస్ట్ గా ఉన్నారు. నాగార్జున వాక్చాతుర్యం, సమయస్ఫూర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ సక్సస్ లో కింగ్ నాగార్జున పాత్ర ఉంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే నాగార్జున బిగ్ బాస్ షో నుంచి తప్పుకుంటున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

    ఒకవేళ అదే కనుక నిజం అయితే నాగార్జున ని రీప్లేస్ చేసే సత్తా టాలీవుడ్ హీరోల్లో ఎవరికి ఉంది అనే చర్చ తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు నాగార్జున హోస్ట్ చేసిన సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఒక్క సీజన్ 6 మాత్రం విఫలం కాగా, నాగార్జున విమర్శలు ఎదుర్కొన్నాడు. బిగ్ బాస్ కాన్సెప్ట్ కి నాగార్జున హోస్టింగ్ అద్భుతంగా సరిపోయింది. మున్ముందు నాగార్జున బిగ్ బాస్ నుంచి డ్రాప్ అయితే .. షో ను అదే స్థాయిలో విజయవంతంగా నడిపించగలిగే సత్తా ఉన్న హీరోలు ఎవరని పరిశీలిస్తే ..

    Also Read: Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఏమైంది? ఆందోళన రేపుతున్న ఫోటో!

    నందమూరి బాలకృష్ణ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆహాలో అన్ స్టాపబుల్ విత్ బాలయ్య తో సెన్సేషన్ సృష్టించారు. ఎవరూ ఊహించని విధంగా హోస్టింగ్ అదరగొట్టారు. ఆయన సెలెబ్రిటిస్ ను ఇంటర్వ్యూ చేసిన తీరు, చలాకితనం మెస్మరైజ్ చేశాయి. బాలయ్య బిగ్ బాస్ హోస్ట్ చేస్తే కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుంది. విజయ్ దేవరకొండ పేరు కూడా గతంలో వినిపించింది. అవి పుకార్లుగానే మిగిలిపోయాయి. కానీ షో ను నడిపించే లక్షణాలు ఆయనలో ఉన్నాయి.

    Also Read: Prudhvi Raj: నటుడు 30 ఇయర్స్ పృథ్వి పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు! ఆయన చేసిన తప్పేంటి?

    అలాగే రానా దగ్గుబాటికి గట్టి హోస్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. గతంలో ఆయన హోస్ట్ చేసిన నంబర్ వన్ యారి మంచి ఆదరణ దక్కించుకుంది. రానా మాటతీరు, కామెడీ టైమింగ్ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో రానా కూడా బిగ్ బాస్ హోస్ట్ గా సరిపోతారని అంటున్నారు. ఒకవేళ హీరోయిన్లతో షో రన్ చేయాలి అని భావిస్తే సమంత పేరు బాగా వినిపిస్తోంది. సమంత క్రేజ్ గురించి తెలిసిందే. పైగా గతంలో బిగ్ బాస్ షోలో ఓ స్పెషల్ ఎపిసోడ్ హోస్ట్ చేసింది. సమంతకి ఆ సత్తా ఉంది అనడంలో సందేహం లేదు. వీరందరి కంటే ఎన్టీఆర్ బెస్ట్ ఛాయిస్. ఫస్ట్ సీజన్ హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ మరోసారి ఆ బాధ్యత తీసుకునే అవకాశం లేదు.