Netflix most-watched movies: లాక్ డౌన్ తర్వాత అత్యధిక శాతం మంది జనాలు బాగా అలవాటు పడిన ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో ఒకటి నెట్ ఫ్లిక్స్(Netflix). ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇందులో అందుబాటులో ఉంటాయి. కోట్లమంది ఇందులో సినిమాలను వీక్షిస్తూ ఉంటారు. మన #RRR చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ రావడానికి, ఆస్కార్ రావడానికి ప్రధాన కారణం నెట్ ఫ్లిక్స్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లేటెస్ట్ సూపర్ హిట్ చిత్రం ‘ఓజీ'(They Call Him OG) నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చింది. తెలుగు తో పాటు హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ అందించిన గణాంకాల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి 4 రోజులకు కలిపి 32 లక్షల వ్యూస్ వచ్చాయి.
2024 నుండి 2025 వరకు విడుదలైన అన్ని పాన్ ఇండియన్ మరియు ప్రాంతీయ బాషా చిత్రాలకు కలిపి చూస్తే ఈ చిత్రం నాన్ ఇంగ్లీష్ మూవీస్ లో టాప్ 5 స్థానం లో నిల్చింది. కానీ అభిమానులు ఆల్ టైం రికార్డు నెలకొల్పుతుందని ఆశించారు కానీ, ఆ రేంజ్ కి చేరుకోలేకపోయింది. ప్రస్తుతానికి ‘పుష్ప 2’ చిత్రం మొదటి నాలుగు రోజుల్లో 58 లక్షల వ్యూస్ ని సాధించి ఆల్ టైం రికార్డు ని నెలకొల్పి నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంది. ఆ తర్వాతి స్థానం లో 51 లక్షల వ్యూస్ తో ‘లక్కీ భాస్కర్’ చిత్రం కొనసాగుతుండగా, ఆ తర్వాతి స్థానం లో ప్రభాస్ కల్కి హిందీ వెర్షన్ 45 లక్షల వ్యూస్ తో మూడవ స్థానంలో కొనసాగుతోంది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం ఏమిటంటే, నేచురల్ స్టార్ నాని ‘హిట్ 3’ చిత్రానికి మొదటి వీకెండ్ లో 42 లక్షల వ్యూస్ వచ్చాయి.
‘ఓజీ’ చిత్రం ‘హిట్ 3’ వ్యూస్ ని దాటడం లో విఫలం అవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘హిట్ 3’ తర్వాత 5వ స్థానంలో ఓజీ 32 లక్షల వ్యూస్ తో కొనసాగుతుంది. నాని కి నెట్ ఫ్లిక్స్ లో వరుసగా మూడు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉండడం తో, ఆయన సినిమాని హిందీ మరియు తమిళ ఆడియన్స్ నెట్ ఫ్లిక్స్ లో చూడడం అలవాటు గా చేసుకున్నారు. అందుకే ఆ రేంజ్ వ్యూస్ వచ్చాయని అంటున్నారు విశ్లేషకులు. ఓజీ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కానీ ఆల్ టైం రికార్డు మిస్ అయ్యిందే అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఓపెనింగ్ మిస్ అయినా లాంగ్ రన్ లో ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ లో మంచి వ్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, చూడాలి మరి.