Nagarjuna: నాగార్జున కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన టాప్ 5 సినిమాలు ఇవే…

Nagarjuna: మొదటగా శివ సినిమా గురించి చెప్పుకుంటే ఆయనకి ఆ సినిమా లేకపోతే మాత్రం ఆయన కెరీర్ అనేది ఇప్పుడు ఈ రేంజ్ లో ఉండేది కాదు అనేది వాస్తవం...

Written By: Gopi, Updated On : June 24, 2024 11:13 am

These are the top 5 biggest hit movies of Nagarjuna career

Follow us on

Nagarjuna: శివ సినిమాతో ఇండస్ట్రీని శాసించిన నాగార్జున ఆ సినిమా ఇచ్చిన బూస్టప్ తోనే స్టార్ హీరోలా లిస్టులోకి చేరిపోయాడు. ఇక ఎప్పుడైతే నాగార్జున శివ సినిమా తీశాడో అప్పటినుంచి ఆయనతో మాస్ సినిమాలు చేయడానికి కొంత మంది దర్శకులు కూడా ప్రయత్నం చేశారు. ఇక అంతకుముందు నాగార్జున ఎప్పుడు రొమాంటిక్ సినిమాలు చేస్తూ వచ్చాడు. శివ సినిమాతో ఆయన కెరీర్ అనేది ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇదిలా ఉంటే నాగార్జున ఎంటైర్ కెరియర్ లో ఆయనను నిలబెట్టిన ఐదు సినిమాల గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

మొదటగా శివ సినిమా గురించి చెప్పుకుంటే ఆయనకి ఆ సినిమా లేకపోతే మాత్రం ఆయన కెరీర్ అనేది ఇప్పుడు ఈ రేంజ్ లో ఉండేది కాదు అనేది వాస్తవం…

నిన్నే పెళ్ళాడుతా
ఈ సినిమా నాగార్జున కెరియర్ లో ఒక మైలు రాయి సినిమా అనే చెప్పాలి. నాగార్జున ఒక ఫ్యామిలి సినిమా చేయగలడు. ఒక ఫ్యామిలీలో ఒక కొడుకు ఉంటే ఎలా ఉంటాడు. అతను చేసే అల్లరి, చూపించే ప్రేమ అవన్నీ ఎలా ఉంటాయి అనే ఒక కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా నాగార్జున ఎంటైర్ కెరియర్ లోనే ఆల్ టైమ్ హిట్స్ లో టాప్ 5 లో నిలిచే సినిమాగా దీన్ని మనం చెప్పుకోవడంలో తప్పులేదు…

అన్నమయ్య
కే రాఘవేంద్ర దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘అన్నమయ్య ‘ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఈ సినిమాలో అన్నమయ్య గెటప్ లో కనిపించిన నాగార్జున నటించి మెప్పించడమే కాకుండా పలు రకాల అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఇక నాగార్జున భక్తి భావాలతో నిండిన ఒక పాత్రను కూడా చేయగలడు అనేది ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత కూడా పలు సినిమాలను చేసిన నాగార్జున వాటితో కూడా మంచి సక్సెస్ లను అందుకున్నాడు…

Also Read: War 2: వార్ 2 సినిమాలో ఎన్టీయార్ సెకండ్ హీరోగా చేస్తున్నాడా..?

శ్రీ రామదాసు
అన్నమయ్య తర్వాత రాఘవేంద్రరావు నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన మరో భక్తిరస చిత్రం శ్రీరామదాసు ఈ సినిమాలో కూడా రామదాసుగా ఆయన ఒక అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇచ్చి ప్రేక్షకులను కట్టి పడేసాడు. నాగార్జున కెరియర్ డల్ గా ఉంది అనుకున్నా సమయంలో శ్రీరామదాసు సినిమా వచ్చి ఒక్కసారిగా చాలా హై లెవెల్ కి తీసుకెళ్ళింది. ఇక దీంతో మరోసారి నాగార్జున ముందుకు సాగుతూ వస్తున్నాడు…

Also Read: Kalki Movie: కల్కి లో అమితాబ్ కి దీపికా పదుకొనే కి మధ్య సంబంధం ఏంటి..?

సోగ్గాడే చిన్నినాయన
2016 లో వచ్చిన ఈ సినిమా అప్పటివరకు నాగార్జున కెరియర్ లోనే ఒక బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక అంతకు ముందు రగడ, భాయ్, డమరుకం లాంటి వరుస ప్లాపుల్లో ఉన్న నాగార్జునకు సోగ్గాడే చిన్నినాయన సినిమా ఒక భారీ ఊరటనిచ్చిందనే చెప్పాలి. ఇక మొదటిసారిగా నాగార్జున ను 50 కోట్ల క్లబ్ లో నిలిపిన సినిమా కూడా ఇదే కావడం విశేషం…ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో నాగార్జున ఇప్పటివరకు కూడా స్టార్ హీరోగా కొనసాగుతూనే వస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు…