https://oktelugu.com/

Game Changer Movie : గేమ్ చేంజర్’ కి తెలంగాణ లో టికెట్ రేట్స్ వచ్చేసాయి..మల్టీప్లెక్స్ థియేటర్స్ కి రేట్స్ ఇవే!

విధంగా ఇండస్ట్రీ వల్ల హైదరాబాద్ కి ఎంత మేలు జరగాలి అనే దానిపై చర్చలు జరిపారు. టికెట్ రేట్స్ పెంచుకోడానికి, అదే విధంగా బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇస్తారో లేదో అప్పుడు చెప్పలేదు కానీ, నేడు పెద్ద సస్పెన్స్ తర్వాత విశ్వ ప్రయత్నాలు చేసి దిల్ రాజు టికెట్స్ రేట్స్ సంపాదించాడు.

Written By:
  • Vicky
  • , Updated On : January 8, 2025 / 09:52 PM IST

    Game changer

    Follow us on

    Game Changer Movie :  గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రానికి తెలంగాణాలో టికెట్ హైక్స్, బెనిఫిట్ షోస్ కి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అనే సస్పెన్స్ కి తెరపడింది. ప్రభుత్వం టికెట్స్ హైక్స్ కి అనుమతి ఇచ్చిన జీవో కాసేపట్లో విడుదల కానుంది. సంధ్య థియేటర్ ఘటన తర్వాత అసలు తెలంగాణ లో బెనిఫిట్ షోస్, టికెట్ రేట్స్ పెంపు ఉండబోదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పడం, ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమ మొత్తం సీఎం ని కలిసి ఇండస్ట్రీ లోని సమస్యలపై, అదే విధంగా ఇండస్ట్రీ వల్ల హైదరాబాద్ కి ఎంత మేలు జరగాలి అనే దానిపై చర్చలు జరిపారు. టికెట్ రేట్స్ పెంచుకోడానికి, అదే విధంగా బెనిఫిట్ షోస్ కి అనుమతి ఇస్తారో లేదో అప్పుడు చెప్పలేదు కానీ, నేడు పెద్ద సస్పెన్స్ తర్వాత విశ్వ ప్రయత్నాలు చేసి దిల్ రాజు టికెట్స్ రేట్స్ సంపాదించాడు.

    సింగల్ స్క్రీన్స్ కి 100 రూపాయిలు, మల్టీప్లెక్స్ కి 150 రూపాయిలు టికెట్ రేట్స్ పెంచుతున్నట్టు తెలుస్తుంది. బెనిఫిట్ షోస్ ఉదయం నాలుగు గంటల నుండి మొదలు కానుంది. పుష్ప 2 కి ఇచ్చినట్టుగా ఈ సినిమాకి ప్రీమియర్ షోస్ కి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఇక నుండి తెలంగాణ లో ప్రీమియర్ షోస్ లేనట్టే అనుకోవాలి. ప్రస్తుతం సింగల్ స్క్రీన్స్ కి 150 రూపాయిల టికెట్ రేట్ ఉంది. దీని మీద 100 రూపాయిలు ఎక్కువ అంటే 250 రూపాయిల టికెట్ రేట్స్ అన్నమాట. అదే విధంగా మల్టీ ప్లెక్స్ కి ప్రస్తుతం 295 రూపాయిలు ఉంది. దీని మీద 150 రూపాయిలు అంటే 445 రూపాయిలు. ఈ రేట్స్ మొదటి 10 రోజులు ఉండనుంది. ఈ చిత్రానికి తెలంగాణ లో 36 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

    పాజిటివ్ టాక్ వస్తే కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆంధ్ర ప్రదేశ్ కి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన సంగతి తెలిసిందే. బెన్ఫిట్ షోస్ కి 600 రూపాయిల టికెట్ రేట్ పెడితే హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోయాయి. ‘పుష్ప 2 ‘ కి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఊపు చూస్తూ ఉంటే ఈ చిత్రం కేవలం మొదటి వారం లోనే 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేలా ఉంది. ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేస్తుందా లేదా అనేది హిందీ మరియు ఇతర భాషల్లో ఎంత వసూళ్లు రాబడుతుంది అనే దానిపై ఆధారపడుంది. చూడాలి మరి ఈ చిత్రానికి ఇతర భాషల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది.