https://oktelugu.com/

PM Narendra Modi : ఏపీపై వెలకట్టలేని అభిమానం.. ప్రధాని ప్రసంగానికి అంతా ఫిదా!

60 ఏళ్ల తర్వాత తొలిసారి మూడోసారి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ అని గుర్తు చేశారు. అది ఏపీ ప్రజల ప్రేమ, అభిమానంతోనేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తామని తేల్చి చెప్పారు. 2047 నాటికి 2.5 బ్రిలియం డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నట్లు నరేంద్ర మోడీ తెలిపారు. ఐ

Written By:
  • Dharma
  • , Updated On : January 8, 2025 / 09:41 PM IST

    Narendra Modi

    Follow us on

    PM Narendra Modi :  ఏపీకి ప్రధాని మోదీ( Narendra Modi) బలమైన భరోసా ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో తమ సహకారం అందిస్తామని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ విశాఖలో( Visakhapatnam) పర్యటించిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. ప్రత్యేక విమానంలో బుధవారం సాయంత్రం విశాఖకు చేరుకున్న ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు( Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( Pawan Kalyan) తో రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఏయు ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో భారీ బహిరంగ సభలో మాట్లాడారు ప్రధాని మోదీ. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. 60 ఏళ్ల తర్వాత తొలిసారి మూడోసారి అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ అని గుర్తు చేశారు. అది ఏపీ ప్రజల ప్రేమ, అభిమానంతోనేనని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తామని తేల్చి చెప్పారు. 2047 నాటికి 2.5 బ్రిలియం డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పెట్టుకున్నట్లు నరేంద్ర మోడీ తెలిపారు. ఐటీ టెక్నాలజీకి ఆంధ్రప్రదేశ్ ప్రధాన కేంద్రం కానుంది అని తేల్చి చెప్పారు. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్ హబ్ గా ఏపీ నిలుస్తుందని చెప్పారు. దేశంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్ లు నడుస్తుంటే.. అందులో ఒకటి విశాఖకు కేటాయించినట్లు తెలిపారు. బల్క్ డ్రగ్ పార్కులు దేశంలో మూడు ఉంటే.. అందులో ఒకటి విశాఖకు కేటాయించినట్లు తెలిపారు.

    * రైల్వే జోన్ కు శంకుస్థాపన
    విశాఖపట్నం రైల్వే జోన్( Visakha railway zone) కు పునాది రాయి వేశారు ప్రధాని మోదీ. ప్రధానంగా ఏపీ ప్రజల చిరకాల వాంఛ ఇది అని.. దానిని తీర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రైల్వే జోన్ వల్ల వ్యవసాయ పర్యాటక రంగాలు ఊపందుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో 700 నడుస్తున్నాయని… అమృత్ భారత్( Amrit Bharat ) కింద ఏపీలో 70 కి పైగా రైల్వేస్టేషన్లు ఆధునికరించిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటు పడతామని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తేల్చి చెప్పారు. కాగా ప్రధాని మోదీ ప్రసంగం ఉత్సాహభరిత వాతావరణం లో సాగింది.

    * చంద్రబాబు కీలక ప్రసంగం
    అంతకుముందు ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. ప్రపంచం మెచ్చిన ఏకైక నాయకుడు ప్రధాని మోదీ( Narendra Modi) అంటూ చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 93% స్ట్రైక్ రేటుతో ఘనవిజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. భవిష్యత్తులో కూడా ఈ పొత్తు కొనసాగుతుందని.. ఢిల్లీ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుస్తుందని తేల్చి చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మోడీ కృషి చేస్తున్నారని కొనియాడారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన మోడీ నినాదాలు అని చెప్పుకొచ్చారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు మేకింగ్ ఇండియా( making India) తెచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా అమరావతి రాజధాని కి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సాయం కావాలని.. నదుల అనుసంధానం తో దశ మారుతుందని కూడా చెప్పుకొచ్చారు చంద్రబాబు. రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం సాధిస్తామని కూడా అన్నారు. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తమదేనని హామీ ఇచ్చారు. ఏపీ విషయంలో ప్రధాని మోదీ ఉదారంగా ఆదుకుంటున్నారని.. గతంలో ఏ ప్రధాని కూడా ఇంత చొరవ చూపలేదన్నారు.

    * ఆకాశానికి ఎత్తేసిన పవన్
    పవన్( Pawan Kalyan) తన ప్రసంగంలో ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. అంధకారంలో ఉన్న ఏపీకి వెలుగులు తెచ్చిన నాయకుడు మోడీ అని కొనియాడారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారని గుర్తు చేశారు. ధైర్య సాహసాలతో నింపితే అది పటిష్ట భారత్ గా మారుతుందని.. సదాశయంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిస్తే అది స్వచ్ఛభారత్ అవుతుందని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. బలమైన భారత్ కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని.. ఆత్మ నిర్భర్ భారత్( nirbhar Bharat ), స్వచ్ఛభారత్ నినాదాలతో మోదీ ప్రజల మనసు గెలుచుకున్నారని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తితో ఏపీలో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. మోదీ సర్కార్ నిధులు ఇవ్వడంతోనే మారుమూల గిరిజన గ్రామాలకు కూడా రోడ్లు వేయగలుగుతున్నామని పవన్ వెల్లడించారు. అభివృద్ధిలో ఏ ప్రాంతం వెనుక పడకూడదు అన్నారు. మోడీ సంకల్పానికి ఆయన అందిస్తున్న సహకారానికి తనవంతుగా కృతజ్ఞతలు తెలిపారు పవన్ కళ్యాణ్.