Vijay Devarakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రౌడీభాయి గా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ..ఈయన తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. ఇక అప్పటినుంచి వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు.
ఇక ఆయన క్రేజ్ చూసిన చాలామంది తొందర్లోనే ఈయన స్టార్ హీరోల లిస్టులో చేరిపోతాడు అనే కామెంట్లు కూడా చేశారు. ఇక ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమా కూడా 100 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి విజయ్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. కానీ ఆయన ఆ తర్వాత సెలెక్ట్ చేసుకున్న స్టోరీ లా వల్లే ఆయన చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి. అందువల్లే ఆయన స్టార్ హీరోగా మారలేకపోయాడు అని చాలామంది అతని మీద కామెంట్లైతే చేస్తుంటారు. ఇక మొత్తానికైతే విజయ్ ఇప్పుడు వరుసగా మూడు ప్రాజెక్టులను లైన్ లో పెట్టాడు. ఇక ఈ మూడు సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకొని ఇండస్ట్రీలో తన స్టార్ డమ్ ని అంతకంతకు పెంచుకోవాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ తన ఎంటైర్ కెరియర్ లో ఒక మూడు సినిమాలను మిస్ చేసుకున్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు.
Also Read: HBD Balayya: బాలయ్య.. నీకుసాటి ఎవరూ రారయ్యా..
అందులో నాని హీరోగా వచ్చిన దసరా సినిమాని మొదట శ్రీకాంత్ ఓదెల విజయ్ దేవరకొండ తో చేయాలని అనుకున్నడట. కానీ ఆయన ఆ కథను రిజెక్ట్ చేయడంతో ఆ కథ నాని దగ్గరికి వెళ్ళింది. నాని చేసిన ఈ సినిమా 100 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి నాని స్టామినా ఏంటో ప్రూవ్ చేసి చూపించింది. ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమాలో కూడా మొదట విజయ్ దేవరకొండని హీరోగా అనుకున్నాడట. కానీ ఆయన ఆ స్క్రిప్ట్ ని రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాని వరుణ్ తేజ్ తో చేసి మంచి సక్సెస్ ని అందుకున్నాడు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గెలుపును సెలబ్రేట్ చేసుకోలేకపోయిన అల్లు అర్జున్… కారణం ఏంటంటే..?
ఇక మరో దర్శకుడు అయిన అజయ్ భూపతి కూడా ఆర్ఎక్స్ 100 సినిమాను మొదట విజయ్ దేవరకొండ తో చేయాలని అనుకున్నారట. కానీ ఆర్ఎక్స్ 100 అర్జున్ రెడ్డి రెండు కథలకు దగ్గరి పోలికలు ఉండడంతో ఆ సినిమాను విజయ్ రిజెక్ట్ చేశాడు. దాంతో అజయ్ భూపతి కార్తికేయను హీరోగా పెట్టి ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు…