HBD Balayya: నందమూరి బాలకృష్ణ.. సీనియర్ ఎన్డీఆర్ నట వారసుడిగా సినిమా ప్రస్థానం ప్రారంభించిన బాలకృష్ణ.. తండ్రి రాజకీయ వరసత్వాన్ని కూడా అందిపుచ్చుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా టీడీపీలో క్రియాశీలకంగా ఉంటూ.. ఎమ్మెల్యేగా ప్రజా సేవ చేస్తున్నారు. అభిమానులు మద్దుగా పిలుచుకునే బాలయ్య ఆకారంలో గంభీరంగా ఉన్నా.. మనసు మాత్రం మెత్తదని చాలా మంది అంటారు. తిక్క రేగితే తిడతాడు, అది నెత్తికెత్తితే కొడతాడన్నది ఎంత నిజమో, మనసుకు నచ్చితే అంతే స్వచ్ఛంగా ప్రేమిస్తాడు అనేదీ అంతే నిజం. అందుకే అభిమానకు బాలయ్య అంటే ఇష్టం. అందుకే బాలయ్య నువ్వు భళా.. నువ్వు బోలా అంటూ కీర్తిస్తుంటారు. నేడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ.
ఆయనకు ఆయనే సాటి..
అందంలో, ఆహార్యంలో, అభినయంలో, వాచకంలో, నృత్యంలో, నిత్యం కొత్తదారుల్ని ఆవిష్కరించడంలో బాలయ్యకు బాలయ్యే సాటి. యాక్షన్, మాస్, ఫిక్షన్, ఫ్యాక్షన్, ఫాంటసీ, హిస్టరీ ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు. బాలయ్య. తండ్రి తరహాలోనే అన్ని జోన్లను టచ్ చేసి విజయం సాధించాడు బాలయ్య. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.
రికార్డులు తిరగరాసి..
తన సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాశాడు బాలయ్య. అందుకే చరిత్ర సృష్టించాలన్నా.. దానిని తిరగ రాయాలన్నా మేమే అంటాడు బాలయ్య. సినిమాలో అనేక ప్రయోగాలు చేశాడు. ఆదిత్య 369, భైరవద్వీపం ఆయన చేసిన ప్రయోగాలే. ఇక ష్యాక్షన్ సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాశాడు. బాక్సఫీలను బద్దలు కొట్టాడు.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ గెలుపును సెలబ్రేట్ చేసుకోలేకపోయిన అల్లు అర్జున్… కారణం ఏంటంటే..?
హిస్టారికల్ సినిమాలు..
తెలుగు ఇండస్ట్రీలో మాస్, యాక్షన్ సినిమాలతో ఊపుమీద ఉన్న సమయంలో బాలకృష్ణ శ్రీరామరాజ్యం, గౌతమి పుత్ర శాతకర్ణి లాంటి కళాత్మక చిత్రాల్లో నటించి మెప్పించారు. ఇక తొడగొట్టడంతో బాలయ్యకు ఎవరూ సాటిరారు. ట్రైన్‌లనూ వెనక్కి పంపి లాజిక్ లేకుండా మ్యాజిక్ చేసి మెప్పించడం బాలయ్యకే సాధ్యం.
Also Read: Ram Charan: శంకర్ మాయలో పడి రామ్ చరణ్ తన కెరియర్ ను వేస్ట్ చేసుకుంటున్నాడా..?
తెరిచిన పుస్తకం..
ఇక బాలయ్య జీవితం తెరిచిన పుస్తకం. మనసులో ఉన్నది మాట్లాడేయడం బాలయ్య స్పెషాలిటీ. వాటికి గ్రామర్ ఉండాల్సిన పనిలేదు అంటారు బాలయ్య. తనని ట్రోల్ చేయడానికి కొంతమంది ఎదురు చూస్తుంటారు అని తెలిసినా బాలయ్య తన స్వభావం వదల్లేదు. బసవతారకం ఆసుపత్రి బాలయ్యలోని మరో ఉదాత్తమైన కోణం. ఆ ఆసుపత్రి ద్వారా ఎంతమంది ప్రాణాల్ని కాపాడాడో లెక్కలేదు. సైలెంటుగా చేసే సేవా కార్యక్రమాలకు పద్దు లేదు. హిందూపురం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి – రాజకీయ రంగంలోనూ విజయపతాక ఎగరేశాడు బాలయ్య. బాలయ్య ఏం చేసినా.. ఎక్కడ ఉన్నా.. ఆయనకు ఓ బ్రాండ్ ఉంది.