Modi Cabinet : కేంద్ర కేబినెట్‌లో ఏడుగురు మాజీ ముఖ్యమంత్రులు..

Modi Cabinet ఇక మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు వివిధ ర్గాల వారిని, వందేభారత్‌ రైళ్లు నడిపిన లోకోపైలట్లు, సహాయ లోకో పైలట్లు, ట్రాన్స్‌ జెండర్లు హాజరయ్యారు.

Written By: NARESH, Updated On : June 10, 2024 1:46 pm

Modi Cabinet

Follow us on

Modi Cabinet : కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో తొలి సంకీర్ణ సర్కార్‌ కొలువుదీరింది. దేశానికి 18వ ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో దైవసాక్షిగా హిందీలో ప్రమాణం చేశారు. దీంతో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత వరుసగా మడోసారి ప్రధాని అయిన నేతగా మోదీ రికార్డు సృష్టించారు. ఇక మోదీతోపాటు 71 మందితో కేంద్ర మంత్రులుగా రాష్ట్రపతి ముర్ము ప్రమాణం చేయించారు.

ఏడుగురు మాజీ సీఎంలు..
ఇక కొత్తగా కొలువుదీరిన కేంద్ర క్యాబినెట్‌లో ఆరుగుకు మాజీ సీఎంలు ఉన్నారు. జాబితాలో గుజరాత్‌ సీఎంగా పనిచేసిన ప్రధాని నరేంద్రమోదీతోపాటు, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్,, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం రాజ్‌నాథ్‌సింగ్, హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్, అసోం మాజీ సీఎం సర్బానంద్‌ సోనోవాల్, కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ.కుమారస్వామి, బీహార్‌ మాజీ సీఎం జితన్‌రామ్‌ మాంఝీ ఉన్నారు. వీరిలో ఐదుగురు బీజేపీ మాజీ సీఎంలు కాగా, కుమారస్వామి, మాఝీలు జేడీఎస్, హిందుస్థానీ అవామీ మోర్చాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

సప్త దేశానినేతల సాక్షిగా..
ప్రధానిగా మోదీ, 71 మంది మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏడు దేశాల అధినేతలు హాజరయ్యారు. వీరిలో మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌ జగన్నాథ్, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్గే, బంగ్లాదేశ్‌ అధ్యక్షురాలు షేక్‌ హసీనా, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మత్‌ ఆఫీస్‌ ఉన్నారు.

విపక్షం గైర్హాజరు..
ఇదిలా ఉండగా, ప్రధాని ప్రమాణ స్వీకార వేడుకకు దేశంలోని విపక్ష నేతలు గైర్హాజరయ్యారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక్కరే రాజ్యసభ విపక్ష నేత హోదాలో హాజరయ్యారు. ఇండియా కూఏటమిలోని కీలక నేతలతో చర్చించిన అనంతరం ఆయన వేడుకకు వచ్చారు. త్రుణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి ఎవరూ రాలేదు. ఇతర విపక్షాలు కూడా గైర్హాజరయ్యాయి.

వివిధ వర్గాల వారు హాజరు..
ఇక మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు వివిధ ర్గాల వారిని, వందేభారత్‌ రైళ్లు నడిపిన లోకోపైలట్లు, సహాయ లోకో పైలట్లు, ట్రాన్స్‌ జెండర్లు హాజరయ్యారు. నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న శ్రామికులు, మన్‌కీబాద్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. వీరిని కొందరు మంత్రులు విడి విడిగా సన్మానించారు