Kalki 2898 AD: కల్కి సినిమాలో ‘ బుజ్జి’ వాహనం తో అదరగొట్టిన ప్రభాస్…

బుజ్జి వాహనానికి సంబంధించిన ఫ్రీ వీడియోని రీసెంట్ గా రిలీజ్ చేశారు అయితే వీడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో దానిని ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం అయితే చేశారు.

Written By: Gopi, Updated On : May 23, 2024 8:46 am

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కల్కి.. అయితే ఈ సినిమాను జూన్ 27వ తేదీన రిలీజ్ చేస్తున్నామని సినిమా యూనిట్ అఫిషియల్ గా అనౌన్స్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా కల్కి సినిమాలో ప్రభాస్ ‘భైరవ ‘ అనే పాత్ర లో నటిస్తున్నాడు. అయితే ఈ భైరవ పాత్రకి ఒక వాహనం కూడా ఉంటుంది దాని పేరు ‘బుజ్జి ‘..అయితే దీనికి సంబంధించిన ప్రీ వీడియో రిలీజ్ ని కూడా రీసెంట్ గా జరిపారు.

అయితే ఈరోజు బుజ్జి కి సంభందించిన ఒక ఈవెంట్ ని నిర్వహించారు. ఇక అందులో భాగంగానే ఇవన్నీ రామోజీ ఫిలిం సిటీ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

అయితే ఈ ఈవెంట్ కి ప్రభాస్ బుజ్జి వాహనం మీదనే రావడం నిజంగా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే బుజ్జి వాహనానికి సంబంధించిన ఫ్రీ వీడియోని రీసెంట్ గా రిలీజ్ చేశారు అయితే వీడియోకి మంచి రెస్పాన్స్ రావడంతో దానిని ప్రేక్షకుల ముందు ఉంచే ప్రయత్నం అయితే చేశారు.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ రిలీజ్ కి రెడీ అవుతుండగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా మీద ఇంతకుముందు అయితే బజ్ మామూలుగా ఉండేది. కానీ ఇప్పుడు తారా స్థాయి కి చేరుకుందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ప్రభాస్ అయితే ఉన్నాడు.

ఇంకా అందుకోసమే ఈ ఈవెంట్ కి ప్రభాస్ బుజ్జి వాహనం పైన వచ్చి ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడమే కాకుండా తన అభిమానులకైతే కన్నుల విందు కలిగించాడనే చెప్పాలి. ఇక ఈ బుజ్జి వాహనాన్ని సినిమాలో యుద్ధ సన్నివేశాలు వచ్చినప్పుడు వాడుకుంటారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియాలో మరో భారీ సక్సెస్ కొట్టబోతున్నట్టుగా కూడా అర్థమవుతుంది…