Star Directors-Star Heroes: మన స్టార్ హీరోల కెరియర్ లను నిలబెట్టిన స్టార్ డైరెక్టర్లు వీళ్ళేనా..?

సినిమా అనేది ప్రస్తుతం మనలో ఒక భాగం అయిపోయింది. అలాగే జనాలని ఎంటర్ టైన్ చేయడంలో కూడా ఈ సినిమాకి ఉన్న ప్రాముఖ్యత ఇంకా దేనికి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

Written By: Gopi, Updated On : September 15, 2024 7:17 pm

Star Directors-Star Heroes

Follow us on

Star Directors-Star Heroes: సినిమా ఇండస్ట్రీ అనేది అందరి విషయంలో ఒకేలా ఉండదు. ఇక్కడ కొందరికి సక్సెస్ ల మీద సక్సెస్ లు దక్కుతూ స్టార్ రేంజ్ కి వెళ్ళిపోతుంటే, మరికొందరు మాత్రం చేసిన ప్రతి సినిమా విషయంలో ప్లాప్ లను మూట గట్టుకుంటూ చాలా చెడ్డ పేరును కూడా సంపాదించుకుంటూ ఉంటారు. అటువంటి క్రమం లో ఇండస్ట్రీ అనేది కొంతమందికి కలిసి వస్తే మరి కొంతమందికి మాత్రం చేదు అనుభవాన్ని మిగులుస్తుంది అనేది వాస్తవం… ఇక ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మన టాప్ హీరోలందరూ తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఒకానొక దశలో మన స్టార్ హీరోల కెరియర్లు పడిపోతున్నాయి అనుకున్న సందర్భంలో కొంతమంది దర్శకులు వచ్చి వాళ్ళ కెరియర్ ను నిలబెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో వరుసగా ఏడు సక్సెస్ లను అందుకొని ఎవ్వరికీ సాధ్యం కానీ ఒక అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. ఇక ఆ తర్వాత ఆయన స్వీయ డైరెక్షన్ లో చేసిన జానీ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట గట్టుకున్న ఆయన దాదాపు పది సంవత్సరాలపాటు ఒక్క సక్సెస్ కూడా లేకుండా ముందుకు సాగుతూ వచ్చాడు. ఇక హరీష్ శంకర్ చేసిన గబ్బర్ సింగ్ సినిమాతో పది సంవత్సరాల తర్వాత ఒక భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్న ఆయన మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చాడు…ఇక పడిపోయిన పవన్ కళ్యాణ్ కిరీయర్ ను నిలబెట్టిన ఘనత కూడా హరీష్ శంకర్ కే దక్కుతుంది…

బాలకృష్ణ

బాలయ్య బాబుకి ‘ లక్ష్మీ నరసింహ’ సినిమా తర్వాత వరుసగా ఒక 6 సంవత్సరాల పాటు ఫ్లాప్ లైతే వచ్చాయి. ఇక ఆ ప్లాపులన్నింటినీ తప్పించుకొనడానికి బాలయ్య బాబు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ అది ఏదీ వర్కౌట్ కాలేదు. ఇక బోయపాటి శ్రీను వచ్చి’ సింహా ‘ సినిమాతో భారీ సక్సెస్ ని అందించాడు. ఇక ఆ తర్వాత కూడా మరోసారి మళ్లీ ప్లాప్ లు వచ్చినప్పుడు అతనే వచ్చి లెజెండ్ తో మరొక బ్లాక్ బస్టర్ అందించాడు. బాలయ్య సినిమా కెరియర్ పరంగా లో అయినప్పుడు బోయపాటి శ్రీను వచ్చి ఒక భారీ సక్సెస్ ని అందించడం అనేది ఆనవాయితీ మారిపోయింది. బాలయ్య బాబు కెరీర్ ని స్ట్రాంగ్ గా నిలబెట్టింది. మాత్రం బోయపాటి శ్రీను అనే చెప్పాలి…

జూనియర్ ఎన్టీయార్

జూనియర్ ఎన్టీఆర్ ను స్టార్ హీరో చేయడంలో దర్శక ధీరుడు రాజమౌళి కీలక పాత్ర వహించాడు. ఇక మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికీ ఆయన కెరీయర్ ను మరోసారి యమదొంగ సినిమాతో గాడిలో పెట్టిన ఘనత కూడా రాజమౌళి కే దక్కుతుంది…