https://oktelugu.com/

Tamil Star Heroes : రాజమౌళి తో సినిమా చేయడానికి 12 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న తమిళ్ స్టార్ హీరోలు…

సినిమా ఇండస్ట్రీ అనేది ఏ ఒక్కరి సొంతం కాదు. ఇక్కడ టాలెంట్ ఉన్నవాళ్లు ఎదుగుతూ ఉంటారు. అందుకే సినిమాలను బాగా తీసి సక్సెస్ సాధించడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్ల కోసమే ఇండస్ట్రీ కూడా ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది...

Written By:
  • Gopi
  • , Updated On : September 15, 2024 / 06:29 PM IST

    Tamil Star Heroes with Rajamouli

    Follow us on

    Tamil Star Heroes :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న రాజమౌళి దర్శక ధీరుడి గా పేరు ప్రఖ్యాతలను పొందడమే కాకుండా దానికి తగ్గట్టుగా సినిమాలను కూడా తీస్తూ యావత్ దేశం మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు. ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన సినిమా గురించి మాట్లాడుకునే రోజు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు మహేష్ బాబును హీరోగా పెట్టి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో వరల్డ్ సినిమా ఇండస్ట్రీలోకి కూడా రాజమౌళి అడుగుపెట్టడం విశేషం… ఇక ‘జేమ్స్ కామెరూన్ ‘ లాంటి దిగ్గజ డైరెక్టర్లు సైతం రాజమౌళి గురించి చాలా గొప్పగా మాట్లాడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాబట్టి వాళ్లతో పాటు దీటుగా తను కూడా ఎదగాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి కూడా రాజమౌళి సిద్ధమవుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక అందరూ అనుకున్నట్టుగానే ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ సినిమా భారీ ప్రభంజనాన్ని క్రియేట్ చేయడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు…

    ఇక ఇదిలా ఉంటే దాదాపు 12 సంవత్సరాల నుంచి తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు రాజమౌళి సినిమాలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్లు ఎవరు అంటే ఒకరు సూర్య కాగా, మరొకరు విక్రమ్… వీళ్ళిద్దరూ తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ తెలుగులో కూడా మంచి గుర్తింపును అయితే సంపాదించుకున్నారు. ఇక బాహుబలి సినిమా స్టార్ట్ చేయకముందే రాజమౌళి సూర్యతో ఒక సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు.

    కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా క్యాన్సల్ అయింది. దాని వల్ల వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అయితే రాలేదు. ఇక రాజమౌళి సినిమాలో ఏ చిన్న క్యారెక్టర్ ఇచ్చిన చేస్తానని సూర్య అప్పట్నుంచి ఇప్పటివరకు ఎదురుచూస్తున్నాడు. కానీ ఆయన సినిమాలో సూర్య కి మాత్రం ఒక క్యారెక్టర్ కూడా రావడం లేదు. ఇక విక్రమ్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. విక్రమ్ ను తన సినిమాలో విలన్ గా తీసుకోవాలని రాజమౌళి అనుకున్నాడట.

    కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు విక్రమ్ కూడా రాజమౌళి నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా? అని ఎదురుచూస్తున్నాడు. కానీ తొందర్లోనే వీళ్ళు కలిసి పని చేయబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఒక దర్శకుడు కోసం స్టార్ హీరోలందరూ వెయిట్ చేయడమైనది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…