https://oktelugu.com/

Director Thirupathi sami : చిరంజీవి తో సినిమా చేయాలనుకున్న ఆ స్టార్ డైరెక్టర్ ఎలా చనిపోయాడు… ఆయన మరణానికి కారణం ఏంటి..?

ఇండస్ట్రీ లో సినిమా అంటే ప్రాణం పెట్టుకొని బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ తమ తమ ప్రయత్నాల ద్వారా సినిమా ఇండస్ట్రీ లో ఉండటానికి సక్సెస్ లను అందుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 15, 2024 / 07:25 PM IST

    Director Thirupathi sami

    Follow us on

    Director Thirupathi sami :  ఒకప్పుడు చిరంజీవి తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా మెగాస్టార్ గా ఇండస్ట్రి లో ఎవరికీ దక్కని ఒక అరుదైన గౌరవాన్ని కూడా దక్కించుకున్నాడు. డ్యాన్స్ ఫైట్ ల్లో తనను మించిన నటులు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా నటన పరంగా కూడా చాలా వైవిధ్యమైన పాత్రలను పోషించాడు. ఇక ఎవరికి సాధ్యం కానీ రీతిలో తను అంతకంతకు పైకి ఎదుగుతూ వచ్చాడు. మరి ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన 70 సంవత్సరాలకు చేరువలో ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా తనదైన రీతిలో సక్సెస్ లను అందుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నాడు. అలాంటి చిరంజీవి తో సినిమా చేయడానికి ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు అందరూ క్యూ కట్టే వాళ్ళు…

    అదే రీతిలో నాగార్జున, వెంకటేష్ లకు భారీ బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందించిన ఒక స్టార్ డైరెక్టర్ చిరంజీవితో సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ అనుకోని కారణాల వల్ల ఆయన ప్రమాదవశాత్తు మరణించారు. ఇంతకీ ఎవరా దర్శకుడు అంటే తిరుపతి స్వామి…ఈయన వెంకటేష్ తో గణేష్ సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత నాగార్జునతో ఆజాద్ అనే సినిమా చేసి నాగార్జునకి కూడా ఒక మంచి గుర్తింపును అయితే ఇచ్చాడు. ఇక వీళ్లిద్దరి తర్వాత చిరంజీవి తో సినిమా చేయడానికి ఆయన సన్నాహాలు చేశాడు.

    కానీ ఆ క్రమంలోనే ఆయన మరణించడమనేది నిజంగా అందర్నీ బాధపెట్టే విషయమనే చెప్పాలి. ఒక మొత్తానికైతే తిరుపతి స్వామి లేని లోటు తీర్చడం ఎవరి వల్ల కాలేదు. నిజానికి చిరంజీవి కూడా ఆయన మరణ వార్త విని చాలా వరకు దిగ్భ్రాంతికి గురయ్యాడనే చెప్పాలి. ఇద్దరు స్టార్ హీరోలకు సక్సెస్ లను ఇచ్చిన ఆయన చిరంజీవిని మాత్రం చాలా కొత్తగా ప్రజెంట్ చేయాలని ప్రయత్నం చేశాడు. ఇక ఆయన చెప్పిన కథ కూడా చిరంజీవి కి బాగా నచ్చిందట.

    దాంతో ఆయన ఇంప్రెస్ అవ్వడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టే కథని రెడీ చేసినందుకు చిరంజీవి అతన్ని మెచ్చుకొని వీలైనంత తొందరగా సినిమా షూటింగ్ చేయాలని అనుకున్నారట. కానీ అనుకోని కారణాల వల్ల ఆయనకు అలా జరగడం తో ఆ సినిమా ఆగిపోయింది. ఇక మొత్తానికైతే చిరంజీవితో సినిమా చేయాలనే తన కల నెరవేరకుండానే ఆయన స్వర్గస్తులవ్వడం అనేది మెగా అభిమానులతో పాటు, సగటు ప్రేక్షకులను కూడా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురి చేసింది…ఇక ఇలాంటి సంఘటనలు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి…