Celebrities Divorced: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా నటులు వాళ్ల సినిమాలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్లు తమ పర్సనల్ లైఫ్ ని కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ల జీవిత భాగస్వాముల నుంచి విడాకులను తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే…ఈ నాలు గైదు ఏళ్లలో ఎవరెవరో విడాకులు తీసుకున్నారో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
అమీర్ ఖాన్
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అమీర్ ఖాన్… తన భార్య ఆయన కిరణ్ రావుకి 2021 వ సంవత్సరంలో విడాకులు ఇచ్చాడు. 16 ఏళ్ల వాళ్ళ వైవాహిక జీవితానికి విడాకులతో ముగింపును పలికారు. ఇక వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు…
ధనుష్
కోలీవుడ్ లో వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను చేసిన ధనుష్ గత సంవత్సరం తన భార్య అయిన ఐశ్వర్య రజినీకాంత్ నుంచి విడాకులు తీసుకున్నాడు. నిజానికి వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాల పాటు చాలా అన్యోన్యంగా కలిసి జీవించినప్పటికీ ధనుష్ కొంతమందితో ఎఫైర్స్ పెట్టుకున్నాడనే కారణం చేతనే ఐశ్వర్య రజనీకాంత్ ధనుష్ కు విడాకులు ఇచ్చిందనే వార్తలైతే వినిపిస్తున్నాయి…
నాగ చైతన్య
అక్కినేని నట వారసుడిగా తనకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న నాగచైతన్య ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే తను ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతా కి విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక వీళ్ళ మధ్య కూడా విడాకులకు కారణం ఇల్లీగల్ ఎఫైర్స్ అనే వార్తలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి…
నిహారిక కొణిదల
నాగబాబు కూతురిగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న నిహారిక చైతన్యను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే వీళ్ళిద్దరి మధ్య కూడా వైవాహిక బంధం చాలా ఎక్కువ కాలం పాటు కొనసాగలేక పోయింది. దాంతో ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో వారిద్దరు విడాకులు తీసుకున్నారు. ఇక ప్రస్తుతం నిహారిక ఇండస్ట్రీలోనే సినిమాలను తీస్తూ ప్రొడ్యూసర్ గా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు…
సానియా మీర్జా
ఇండియన్ స్టార్ టెన్నిస్ క్రీడకారిణి అయినా సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ ని పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. 2010 వ సంవత్సరంలో వీళ్ళ పెళ్లి జరగ్గా ప్రస్తుతం 2024 వ సంవత్సరంలో వీళ్ళిద్దరూ విడిపోయినట్టు అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ అయితే బయటికి వచ్చింది…
హార్దిక్ పాండ్యా
ఇండియన్ టీం స్టార్ ఆల్ రౌండర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హర్థిక్ పాండ్యా 2020 సంవత్సరంలో నటషను పెళ్లి చేసుకున్నాడు. ఇక వీళ్ళకి అగస్త్య అనే ఒక బాబు కూడా ఉన్నాడు. వీళ్ళు ఈ సంవత్సరం విడాకులు తీసుకున్నారు…
శిఖర్ ధవన్
ఇండియన్ క్రికెట్ టీం లో స్టార్ బ్యాట్స్ మెన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శిఖర్ ధావన్ సైతం తన భార్య అయిన అయేషా ముఖర్జీ నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇక వీళ్ళకి 2012 వ సంవత్సరంలో పెళ్లి అవ్వగా, 2021 వ సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఇప్పటికే వీళ్లకు అలియా ధావన్, రియా ధావన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
హనీ సింగ్
ర్యాప్ సింగర్ గా మంచి పేరు సంపాదించుకున్న హాని సింగ్ తన భార్య అయిన శాలిని తల్వార్ నుంచి విడాకులు తీసుకున్నాడు..13 ఏళ్ల వీరి వైవాహిక జీవితానికి పులిస్టాప్ పడినట్టైంది…
ఇక ఈ సెలబ్రెటీలలో ఎక్కువ మంది లైఫ్ లు చిన్నాభిన్నం కావడానికి కారణం ఇల్లీగల్ ఎఫైర్స్ అనే వార్తలైతే జోరుగా వినిపిస్తున్నాయి…