Music Directors: తెలుగులో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నప్పటికి మన దర్శకులు ఇంకా బయటి వాళ్ల మీదే ఆధారపడుతున్నారు కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఇలాంటి క్రమం లో వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు...

Written By: Gopi, Updated On : September 15, 2024 11:21 am

Music Directors

Follow us on

Music Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇప్పుడనే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా సంవత్సరాల నుంచి చాలా మంచి చరిత్ర అయితే ఉంది. అందులో భాగంగానే ఇక్కడి నుంచి ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలుగా ఎదిగి తనను తాము ప్రూవ్ చేసుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని ఘన కీర్తిని కూడా సంపాదించి పెట్టారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్స్ ని తెలుగు ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు ఎక్కువగా పట్టించుకోవడం లేదు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే తెలుగు సినిమా స్థాయి ఏంటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ మన వాళ్ళని మనమే తక్కువ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ మరికొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో దేవి శ్రీ ప్రసాద్, మణిశర్మ, మిక్కి జె మేయర్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు చాలా కాలం పాటు ఇండస్ట్రీలో తమదైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. నిజానికి వీళ్ళందరూ చాలా మంచి మ్యూజిక్ ఇస్తు చాలా సంవత్సరాల నుంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు గా వెలుగొందుతున్నారు. అయినా కూడా వీళ్లను పక్కనపెట్టి ఇతర భాషల నుంచి వేరే మ్యూజిక్ డైరెక్టర్లను తీసుకువచ్చి మన స్టార్ డైరెక్టర్లు వాళ్ల చేత మ్యూజిక్ చేయించుకుంటున్నారు.

ఫలితంగా వాళ్లు అంత మంచి మ్యూజిక్ ని ఇవ్వకపోగా సినిమాలు ప్లాపు అవ్వడం లో వాళ్లు కూడా కీలకపాత్ర వహిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో మన వాళ్ళని మనమే ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ప్రస్తుతం దేవర సినిమాతో కొరటాల శివ అనిరుధ్ లాంటి ఒక తమిళ్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకొచ్చి సినిమాకి మ్యూజిక్ ని కొట్టించినప్పటికీ ఆయన ఏమాత్రం తన మ్యూజిక్ తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేయలేకపోయాడు.

ఇక దేవర సినిమా ఈనెల 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో సినిమా ఫలితం ఎలా ఉన్నా కూడా సాంగ్స్ విషయంలో గానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో గాని తన మార్కు ను అయితే చూపించలేకపోయాడు అనేది వాస్తవం. ఇక రీసెంట్ గా ‘మత్తు వదలరా 2’ సినిమాతో కాలభైరవ తన స్టామినా ను చూపించుకొని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఈయనకు మాత్రం పెద్ద సినిమాల నుంచి ఆఫర్లు రాలేకపోతున్నాయి.

కారణం ఏదైనా కూడా కాలభైరవ లాంటి ఒక యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ను వాడుకోవడంలో తెలుగు సినిమా దర్శకులు కూడా చాలా వరకు ఫెయిల్ అవుతున్నారనే చెప్పాలి. మత్తు వదలరా 2 సినిమాలో ఆయన ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గాని, మ్యూజిక్ గాని ప్రేక్షకులందరిని ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా సక్సెస్ లో కూడా ఆయన చాలా వరకు కీలక పాత్ర వహించాడనే చెప్పాలి… మరి ఫ్యూచర్ లో అయినా మన మ్యూజిక్ డైరెక్టర్ లకి అవకాశాలు వస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…