Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్(Deputy Cm Pawankalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 28 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు అంటున్నారు కానీ, చాలా వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ బ్యాలన్స్ ఉండడం తో ఏప్రిల్ లేదా మే నెలలో విడుదల అవుతుందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఒక్కొక్కటిగా బయటకి వదులుతున్నారు. నెల రోజుల క్రితం పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి సాంగ్ ని రిలీజ్ చేయగా, అనుకున్నంత రెస్పాన్స్ ఆ పాటకు రాలేదు. అభిమానులు ఈ సినిమా నుండి మంచి హై ఇచ్చే కంటెంట్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ వస్తున్నారు. కానీ ప్రొడక్షన్ టీం నుండి నీరసపు ప్రమోషనల్ కంటెంట్స్ మాత్రమే వస్తున్నాయి. అభిమానులు ఊపు తెచ్చుకోలేకపోతున్నారు. కాసేపటి క్రితమే కొల్లగొట్టినాదిరో(Kollagottinadiro Song Promo) పాటకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేసారు.
రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ తో ఉన్న పోస్టర్ ని విడుదల చేసి ఈ సాంగ్ ప్రకటన చేయగానే, అందరూ మంచి మెలోడీ సాంగ్ ఏమో అని అనుకున్నారు. కానీ తీరా చూస్తే మాస్ బీట్ సాంగ్ వదిలారు. చెప్పిన ప్రకటనకు, విడుదల చేసిన ప్రోమో కి అసలు పొంతనే లేదు, ఇదేమి మూవీ టీం అసలు, పాన్ ఇండియన్ సినిమాని ఇలాగేనా ప్రమోట్ చేసేది అంటూ సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. హీరో, హీరోయిన్ మధ్య డ్యూయెట్ సాంగ్ అన్నట్టుగానే ఇంకా ప్రచారం చేస్తున్నారు. అభిమానులు అసలు అర్థం కాక జుట్టుపీక్కుంటున్నారు. ఇక ఇప్పుడు విడుదల చేసిన పాట కూడా చాలా సాదాసీదాగా ఉంది. రెగ్యులర్ మాస్ బీట్ సాంగ్ లాగానే ఉంది కానీ కొత్తదనం లేదు. పవన్ కళ్యాణ్ లుక్స్ కొన్ని చోట్ల బాగున్నాయి కానీ, కొన్ని చోట్ల ట్రోల్ స్టఫ్ అయ్యేలా ఉంది.
ఎడిటర్ కి ఎలాంటి స్టిల్స్ పెట్టాలో కూడా తెలియదా అంటూ పవన్ అభిమానులు మండిపడుతున్నారు. ఇకపోతే ఈ పాటలో అనసూయ, పూజిత పొన్నాడ కనిపించారు. వాస్తవానికి మొదటి నుండి వీళ్లిద్దరు ఉన్న సాంగ్ వేరు, కొల్లగొట్టినాదిరో సాంగ్ వేరు అంటూ ప్రచారం చేసారు. కానీ ఇప్పుడు అభిమానులకు అర్థం అవ్వడం లేదు, అవి కేవలం ప్రచారం మాత్రమేనా, లేకపోతే నిధి అగర్వాల్ ఉన్నటువంటి కొల్లగొట్టినాదిరో లిరిక్ కూడా ఇందులోనే ఉంటుందా అనే కన్ఫ్యూజన్ లో పడిపోయారు. దీనిపై ప్రొడక్షన్ టీం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మొత్తం మీద రెండవ లిరికల్ వీడియో సాంగ్ అభిమానుల్లో పెద్ద గందరగోళానికి తెరలేపాయి. చూడాలి మరి పూర్తి పాట అయిన అభిమానులను అలరిస్తుందా, లేదా ఇదే విధంగా నిరాశపరుస్తుందా అనేది. ఈ రెండు పాటల తర్వాత ఈ మూవీ నుండి మేకింగ్ వీడియో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Get ready for a blast of mass beats and the ultimate swag of Powerstar @PawanKalyan! #HHVM 2nd Single song promo is out now ❤️#Kollagottinadhiro – https://t.co/3O4MeCXMaE#UdaaKeLeGayi – https://t.co/ssk1LrWdH4#EmmanasaParichutta – https://t.co/d2hDkTTyRZ… pic.twitter.com/mY5tbHnMPo
— Hari Hara Veera Mallu (@HHVMFilm) February 21, 2025