https://oktelugu.com/

SRH : శుభవార్త.. రేసు గుర్రం వచ్చేస్తున్నాడు.. ఈసారి సన్ రైజర్స్ ఫైనల్ చేరడం పక్కా

SRH : ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫి కొనసాగుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై న్యూజిలాండ్.. రెండవ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై భారత్ గెలిచాయి.

Written By: , Updated On : February 21, 2025 / 02:12 PM IST
SRH

SRH

Follow us on

SRH : ఛాంపియన్స్ ట్రోఫీ ముసిన తర్వాత అసలు సిసలైన క్రికెట్ సంబరం మొదలవుతుంది. ప్రపంచంలోనే అత్యంత రిచ్ క్రికెట్ లీగ్ అయిన ఐపీఎల్ 18వ ఎడిషన్ మొదలవుతుంది. ఈసారి ట్రోఫీ దక్కించుకోవాలని బరిలో ఉన్న పది జట్లు భావిస్తున్నాయి. పోటాపోటీగా ఆటగాళ్లకు శిక్షణ ఇస్తున్నాయి. అందుబాటులో ఉన్న ఆటగాళ్లకు ట్రైనింగ్ క్యాంపులు నిర్వహిస్తున్నాయి. ఐపీఎల్ అనగానే మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టుగా చెన్నై, ముంబై గుర్తుకు వస్తాయి. అయితే ఈ జాబితాలో చెన్నై, ముంబై, కోల్ కతా తర్వాత గుర్తుకు వచ్చే పేరు హైదరాబాద్. గత సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ వెళ్ళింది. ఫైనల్ లో కోల్ కతా చేతిలో ఓటమిపాలైంది. అయితే ఫైనల్ దాకా హైదరాబాద్ జట్టును కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తనదైన నాయకత్వ పటిమతో ముందుకు తీసుకెళ్లాడు. గొప్ప గొప్ప జట్లను ఓడించాడు.. అయితే ఇటీవల ప్యాట్ కమిన్స్ గాయపడ్డాడు. ఫలితంగా చాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యాడు. అతడు దూరం కావడంతో ఆస్ట్రేలియా జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

ఇటీవల కమిన్స్ సతీమణి రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. పితృత్వ సెలవుల్లో భాగంగా కమిన్స్ కొద్దిరోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నాడు. ఆ తర్వాత చీలమండకు గాయం కావడంతో అతడు ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్నాడు. అయితే అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని.. ఐపీఎల్ నాటికి అందుబాటులోకి వస్తాడని సన్ రైజర్స్ హైదరాబాద్ వర్గాలు చెబుతున్నాయి. ” కమిన్స్ కోలుకుంటున్నాడు. అతడు ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐపీఎల్ లో అతడు సత్తా చూపిస్తాడు. గత సీజన్ మాదిరిగానే ఈసారి హైదరాబాద్ జట్టును నడిపిస్తాడు. అతడి నాయకత్వంలో హైదరాబాద్ గత సీజన్లో అద్భుతమైన విజయాలు సాధించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసింది. ఇప్పటికీ ఆ రికార్డును బద్దలు కొట్టే జట్టు రాలేదు. ఈసారి కూడా ఆకాశమే హద్దుగా హైదరాబాద్ జట్టు చెలరేగిపోతుంది. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. అతని రాక కోసం మేము అత్యంత ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. కచ్చితంగా అతడు హైదరాబాద్ జట్టును మరో స్థాయికి తీసుకెళ్తాడు. మాకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉంది. కమిన్స్ త్వరగా కోలుకొని.. జట్టులోకి వస్తే.. హైదరాబాద్ మరింత పట్టిష్టమవుతుందని” సన్ రైజర్స్ హైదరాబాద్ వర్గాలు చెబుతున్నాయి.. కమిన్స్ జట్టులోకి రావడం ఖాయం కావడంతో.. ఈసారి కూడా హైదరాబాద్ ఫైనల్ వెళ్తుందని అభిమానులు సోషల్ మీడియా వేదిక వ్యాఖ్యానిస్తున్నారు.. గాయం కావడంవల్ల కమిన్స్ ఐపీఎల్ కు దూరం అవుతాడని భావించామని.. కానీ ఇప్పుడు అతడు కోలుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్ పూర్వబలం సాధిస్తుందనే నమ్మకం ఉందని.. కచ్చితంగా ఫైనల్ వెళుతుందని హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.